మంచు ఫ్యామిలీ నుండి ఆమెకు ఫోనొచ్చింది

Update: 2017-07-22 08:14 GMT
తెలుగు టి‌వి ఇండస్ట్రి లో ఇప్పుడు స్టార్లు ఎవరు అంటే అందరూ చెప్పేవి ఆ రెండు పేరులే. అందులో ఒక పేరు మాత్రం అనసూయ దే. చాలామంది యాంకర్లు గా మొదలుపెట్టి కొద్ది కాలం చేయగానే సినిమాలో అవకాశాలు రావడంతో యాంకరింగ్కు స్వస్తి పలికేశారు. కొందరు అక్కడ కూడా మంచి గుర్తింపే తెచ్చుకున్నారు కానీ స్టార్ నటులు కాలేకపోయారు. అలా తన కెరియర్ కాకూడదు అని అనసూయ చాల జాగ్రతగా అడుగులు వేస్తోంది.  పాపులర్ షో లకు యాంకరింగ్ చేస్తూనే సినిమాలలో కూడా నటిస్తోందీ తెలుగు సుందరి.

క్షణం సినిమాలో నటించి తన నటనతో అందరిని ఆకట్టుకున్న అనసూయ ఆ తరువాత చాల సినిమా ఆఫర్లు వచ్చిన ఏవి చేస్తే తన కెరియర్ ఎలా మలుపు తీసుకుంటుందో అని ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇప్పుడు తన నిరీక్షణకు ఒక మంచి అవకాశమే వచ్చింది అనే చెప్పాలి. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్లో వస్తున్న రంగస్థలం 1985 సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తుంది అనసూయ. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. ఈ సినిమా చేస్తూనే కొన్ని టి‌వి షోలు హోస్ట్ గా చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఇప్పుడు ఈమెకు మరో ఛాన్స్ వచ్చిందట.

రామ్ చరణ్ రంగస్థలం కాకుండా మరో  పెద్ద సినిమాలో నటించే అవకాశం అనసూయకు వచ్చినట్లు టాక్. మంచు ఫ్యామిలి నుండి అనసూయకు ఒక ఫోన్ వచ్చిందట. మోహన్ బాబు - విష్ణు నటించబోతున్న కొత్త సినిమాలో ఒక పాత్ర కోసం అనసూయను సంప్రదించినట్లు చెబుతున్నారు సినీ వర్గాలు. రైటర్ మదన్ డైరక్షన్లో చేయబోతున్న ఈ సినిమాలో ఒక పాత్ర అనసూయ అయితేనే బాగుంటుంది అని భావిస్తున్నారట. అందుకే ఆమెకు ఫోన్ చేశారట.
Tags:    

Similar News