MAA వార్: కోర్టుకెళ‌తాన‌ని అనసూయ వార్నింగ్

Update: 2021-10-13 04:30 GMT
MAA ఎన్నికల‌లో వ‌రుస ట్విస్టులు ఊహ‌తీతంగా మారిన సంగ‌తి తెలిసిందే. గెలుస్తాడ‌నుకున్న ప్ర‌కాష్ రాజ్ ఓడారు. మంచు విష్ణు అజేయమైన మెజారిటీతో అధ్య‌క్షుడ‌య్యారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా అన‌సూయ‌ పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఓట్ల లెక్కింపుల అనంత‌రం అన‌సూయ గెలిచిందంటూ ప్ర‌చార‌మైంది. కానీ అనూహ్యంగా ఆ మ‌రుస‌టి రోజు అన‌సూయ ఓట‌మి పాల‌య్యార‌ని ప్ర‌క‌టించారు. తొలి రోజు గెలిచింద‌ని మ‌రునాడు ఓడింద‌ని ప్ర‌క‌టించ‌డంతో అన‌సూయ తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు.

ఈ ప‌రిణామం అనంత‌రం మొత్తం ప్యానెల్ స‌మ‌క్షంలో మీడియాతో మాట్లాడుతూ.. అనసూయ తన పేరును ప్రతిపక్ష ప్యానెల్ సభ్యులు అనవసర వివాదాలలో లాగితే తాను కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. తన పేరును డీగ్రేడ్ చేస్తూ అబద్ధాలతో ముడివేసి ప్ర‌చారం చేస్తే చిక్కులు త‌ప్ప‌వ‌ని.. వివాదాలు తనకు ఆసక్తి లేదని స్పష్టం చేసారు. అన‌సూయ ప్ర‌స్తుతం టాలీవుడ్ లో కెరీర్ ప‌రంగా వ‌రుస చిత్రాల‌తో స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక రాజ‌కీయాల జోలికి వెళ్ల‌కుండా సినిమాల‌తో బిజీ అయ్యే ప్లాన్ లో ఉన్నార‌ని ఒక సెక్ష‌న్ ప్ర‌చారం చేస్తోంది.

మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి ఎన్నికల్లో గెలిచిన 11 మంది EC సభ్యులు విష్ణు మంచు ప్యానెల్ తో పనిచేయడానికి ఇష్టపడనందున వారి పదవులకు రాజీనామా చేశారు. అలాగే ప్ర‌కాష్ రాజ్ `మా`కు రాజీనామా చేసినా తిరిగి ఆ రాజీనామాను ఉప‌సంహ‌రించుకుంటున్నాన‌ని ప్ర‌క‌టించిన‌ట్టు వార్త‌లొచ్చాయి.

మా కొత్త అధ్య‌క్షుడు నెక్ట్స్ ఏంటి?

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల హోరా హోరీ హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ తో సాగిన హోరాహోరీ పోరులో  వంద పైగా ఓట్ల మెజారిటీతో మంచు విష్ణు గెలుపొంది అధ్య‌క్షుడయ్యారు. విష్ణు ప్యానెల్ నుంచి ర‌ఘుబాబు- శివ బాలాజీ త‌దిత‌రులు గెలుపొందారు. మాణిక్-హరినాథ్ బొప్ప‌న విష్ణు-ప‌సునూరి- శ్రీ‌ల‌క్ష్మి-జ‌య‌వాణి-శ‌శాంక్- పూజిత కార్య‌వ‌ర్గ స‌భ్యులుగా గెలుపొందారు. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ర‌ఘుబాబు.. ట్రెజ‌ర‌ర్ గా శివ‌బాలాజీ ఎన్నిక‌య్యారు. ఓట్ల లెక్కింపు ఆరంభం నుంచి మంచు విష్ణు ప్యానెల్ దూకుడు ప్ర‌ద‌ర్శించినా ఒక ద‌శ‌లో ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ సభ్యుల లీడ్ పెరిగింది. ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ నుంచి న‌లుగురు స‌భ్యులు గెలుపొందార‌ని తొలుత స‌మాచారం అందింది. న‌టుడు శివారెడ్డి అత్య‌థిక మెజారిటీతో గెలుపొందగా.. ఇదే ప్యానెల్ నుంచి కౌశిక్- సురేష్ కొండేటి గెలుపొందారు. అనంత‌రం ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన వారంతా రాజీనామాలు చేసారు. ప్ర‌కాష్ రాజ్ కి తొలి నుంచి అండ‌గా నిలిచిన మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా స‌మ‌ర్పించిన సంగ‌తి తెలిసిందే.

2021-23 సీజ‌న్ కి MAA అధ్యక్షుడయ్యారు. విష్ణు ప్యానెల్ కూడా కఠినమైన వార్ లో అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న‌తో హాట్ టాపిక్ గా నిలిచింది.

గెలుపు అనంత‌రం తన మద్దతుదారులకు సినీ వర్గాలకు ధన్యవాదాలు తెలిపారు. నా సినిమా సోదరులు నాపై చూపిన ప్రేమ మద్దతుతో గెలిచినందుకు ఆనందంగా ఉంది. వారి ప‌ట్ల‌ నేను వినయపూర్వకంగా ఉన్నాను.. అని కొత్త అధ్య‌క్షుడైన విష్ణు ట్వీట్ చేశారు. ఇక‌పోతే విష్ణు త‌దుప‌రి ఎలాంటి కార్య‌క‌లాపాలు చేస్తార‌న్న‌ది వేచి చూడాలి. ఆర్టిస్టుల సంక్షేమం స‌హా `మా` సొంత భ‌వ‌నం నిర్మాణంపై అత‌డు దృష్టి సారించే వీలుంద‌ని భావిస్తున్నారు. ముఖ్యంగా `మా` భ‌వంతి నిర్మాణం కోసం అత‌డు ఎవరి నుంచి డ‌బ్బు తీసుకోన‌ని మొత్తం తానే పెట్టుబ‌డిగా పెడ‌తాన‌ని ప్ర‌క‌టించారు. అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తోను విష్ణు-మోహ‌న్ బాబు ద్వ‌యం స‌యోధ్య‌ను ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News