'ఆంటీ' రచ్చ.. అన్నంత పని చేసిన అనసూయ..!

Update: 2022-08-30 07:36 GMT
బుల్లితెర యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఓవైపు టీవీ షోలలో హాట్‌ నెస్ తో అదరగొడుతూనే.. మరోవైపు అవకాశం వచ్చిన్నప్పుడల్లా సినిమాల్లోనూ సత్తా చాటుతోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండే అనసూయ.. పలు అంశాలపై స్పందించే విధానం వివాదాస్పదంగా వైరల్ గా మారుతూ ఉంటుంది.

గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో అనసూయను 'ఆంటీ' అంటూ టార్గెట్‌ చేస్తూ కొందరు నెటిజన్లు ఆమెపై అభ్యంతరకరమైన రీతిలో కామెంట్స్‌ చేస్తూ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఘాటుగా స్పందించిన యాంకర్‌.. మరోసారి ఆంటీ అంటే తప్పకుండా వారిపై చర్యలు తీసుకుంటానని పలుమార్లు హెచ్చరికలు చేశారు.

అయినా ఏమాత్రం వెనక్కు తగ్గని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ వచ్చారు. 'ఆంటీ' అనే హ్యాష్ ట్యాగ్ తో వేలకొద్దీ ట్వీట్లు చేసి నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యేలా చేశారు. దీంతో సహనం కోల్పోయిన అనసూయ.. అన్నంత పని చేసింది. తనను ఏజ్ షేమింగ్ చేస్తున్నారంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన అనసూయ.. ''నన్ను ట్రోల్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునే ప్రాసెస్‌ మొదలైంది. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసు పెట్టొద్దు అనుకొని ఇప్పటి వరకు సమయం వెచ్చించాను. కానీ చేయక తప్పలేదు. సపోర్ట్ చేసిన సైబర్ క్రైమ్ అధికారులకు థ్యాంక్స్'' అని పేర్కొంది.

సైబర్ క్రైమ్ కు కంప్లైట్‌ చేసిన అక్నాలెజ్డ్ మెంట్ తాలుకూ స్క్రీన్‌ షాట్‌ ని అనసూయ షేర్‌ చేసింది. ఆన్ లైన్ అబ్యూస్ చేయకండి.. బాడీ షేమింగ్ చేయడాన్ని స్టాప్ చేయండి అంటూ హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, 'అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావడం లేటవ్వచ్చేమోకానీ.. రావడం మాత్రం పక్కా!' అని అంటూ ఈనెల 25న అనసూయ ట్వీట్‌ చేయడంతో ఈ రచ్చ మొదలైంది. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్' సినిమాకు నెగెటివ్ టాక్ రావడాన్ని ఉద్దేసిందే పరోక్షంగా ఇలా ట్వీట్ చేశారని నెటిజన్లు అభిప్రాయ పడ్డారు.

'అర్జున్ రెడ్డి' టైమ్ లో 'ఏం మాట్లాడుతున్నావ్ రా మా***' అనే విజయ్ దేవరకొండ వ్యాఖ్యలకు కౌంటర్ గా.. 'లైగర్' సినిమా రిజల్ట్ పై అనసూయ కామెంట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో 'ఆంటీ' అంటూ మీమ్స్‌ - ట్వీట్స్‌ తో ట్రోలింగ్ చేశారు. దీనిపై అనసూయ కూడా రిప్లై ఇస్తూ వచ్చింది. అయినా ట్రోలింగ్ ఆగకపోవడంతో ఇప్పుడు వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News