వీడియోలో అనసూయ ఊపి ఊపి ఊపేసింది

Update: 2016-12-02 11:30 GMT
హాట్ యాంకర్ అనసూయ.. యాంకరింగ్ ట్యాలెంట్ కి ఓ రేంజ్ లో గ్లామర్ జోడించి టీవీల్లో సత్తా చాటి.. సినిమాల్లోకి వచ్చేసింది. ఇక్కడ సోగ్గాడు.. క్షణం లాంటి సినిమాలతో నటనలో కూడా తన రేంజ్ చూపించింది. ఇప్పుడు విన్నర్ మూవీలో ఐటెం సాంగ్(అనసూయ భాషలో స్పెషల్ సాంగ్) లో కూడా సత్తా చాటేయబోతోంది. మరి ఐటెం సాంగ్ అంటే.. ఓ రేంజ్ లో డ్యాన్సులు ఇరగదీయాలి.

కానీ అనసూయ ఇప్పటివరకూ చూపించినవన్నీ చిన్నా చితకా ప్యారడీ డ్యాన్సులే. సోగ్గాడే చిన్ని నాయనలో ఓ పాటకు డ్యాన్స్ వేసినా.. నలుగురిలో ఒకరిగా కనిపించేసరికి అంతగా స్క్రీన్ టైం లేకపోయింది. మరి అనసూయ డ్యాన్సింగ్ ట్యాలెంట్ తెలిసేదెలాగబ్బా అని ఫ్యాన్స్ అనుకుంటుంటే.. విన్నర్ చూసి తెలుసుకునే లోపే ఓ బంపర్ ఆఫర్ ఇచ్చేసింది అనసూయ. ఓ ఇంగ్లీష్ పాటకు డ్యాన్స్ వేసి ఫేస్ బుక్ లో పెట్టేసింది. అల్బేనియా సింగర్ ఫ్లోరి ముమాజెసి పాడిన 'బ్యాంగ్ ద షాట్ మి వన్ టైమ్' సాంగ్ కు తన స్టెప్స్ చూపించి కుమ్మేసింది అనసూయ. బెల్లీ డ్యాన్స్ లో తన ట్యాలెంట్ తో నడుం ఊపుళ్లతో చూపించేసింది.

ఇది కదా అనసూయ నుంచి మాక్కావాలసింది అనుకుంటూ అభిమానులు తెగ ఆనందించేస్తున్నారు. తొలిసారిగా అనసూయ డ్యాన్సులను ఈ రేంజ్ లో చూసి మురిసిపోతున్నారు. 15 సెకన్ల వీడియోలోనే ఇంత డ్యాన్స్ చేస్తే.. రేపు విన్నర్ లో స్పెషల్ సాంగ్ లో ఇంకెంత రచ్చ చేస్తుందో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News