భర్తతో కొంటె సరసమాడుతూ బుగ్గ గిల్లిన గ్లామర్ బ్యూటీ!!

Update: 2021-01-02 13:57 GMT
తెలుగు గ్లామరస్ యాంకర్‌ అనసూయ అంటే తెలియని తెలుగువారు లేరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. ఒకవైపు టీవీ షోలు మరోవైపు వరుస సినిమాలను సమానంగా బాలన్స్ చేస్తోంది. టీవీ షోలలో స్టేజి పై తన అందాలతో ఎంతటి మాయ చేస్తుందో అందరికి తెలిసిందే. అలాగని టీవీలో.. సినిమాలలో మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా అమ్మడి అందాలకు ఫాలోయింగ్ మాములుగా లేదు. ఈ మేరకు అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నాయి. స్టార్ హీరోయిన్లకు సైతం అసూయ పుట్టే విధంగా అనసూయ అందాలు కుర్రకారును అల్లాడిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండి డ్రెస్సింగ్ స్టైల్స్ తో అభిమానులను ఆకర్షిస్తుంది.

తాజాగా అనసూయ పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వయ్యారాలు ఒలకబోస్తూ కొంటె లుక్ లో భర్తతో దర్శనమిచ్చింది. కేవలం అందంగా కనిపించడమే కాదు అందుకు తగట్టుగా స్మైల్ గా ముస్తాబవడం కూడా అమ్మడికి బాగా తెలుసు. ఇటీవలే భర్త భరద్వాజ్ తో దిగిన ఫోటో ఒకటి పోస్ట్ చేసింది. అందులో పొట్టి డ్రెస్ వేసుకొని భర్త బుగ్గను గిల్లుతూ కనిపించింది. అందులో భర్తతో కొంటె సరసలాడుతుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అలా భర్త మీదకి ప్రేమగా వాలిపోతున్న అనసూయను భరద్వాజ్ గట్టిగా కౌగిలిలో బంధించాడు. సోషల్ మీడియాలో అనసూయకు స్టార్ హీరోయిన్లలా భారీ ఫాలోయింగ్ ఉండటంతో ఈ ఫొటోకు లైక్స్ వర్షం కురుస్తోంది. ప్రస్తుతం పిక్ తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా అనసూయ ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండా సినిమా చేస్తూ, థాంక్ యూ బ్రదర్ సినిమాలు చేస్తుంది.
Tags:    

Similar News