చరణ్ సినిమాలో అనసూయ అలా కాదంట

Update: 2017-04-16 06:39 GMT
రామ్ చరణ్ కొత్త సినిమాకు సంబంధించి ఏ చిన్న రూమర్ వచ్చినా చాలు.. వెంటనే అలర్ట్ అయిపోతోంది ఈ చిత్ర యూనిట్. వెంటనే మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించేసి అసలు వాస్తవమేంటో క్లారిటీ ఇస్తున్నారు. ఇటీవలే సమంత క్యారెక్టర్ గురించి కూడా ఇలాగే స్పందించారు. ఈ చిత్రంలో సమంత మూగ అమ్మాయిగా నటిస్తున్నట్లు మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సమంత అభిమానుల్లో ఒకరకమైన కలవరం మొదలైంది. దీంతో #rc11 యూనిట్ అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు అనసూయ క్యారెక్టర్ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని కూడా అలాగే ఖండించారు.

అనసూయ ఇందులో క్యామియో రోల్ చేస్తోందని.. ఒక పాటలో ఆమె నర్తిస్తుందని మీడియాలో రూమర్లు వచ్చాయి. ఐతే నిజానికి సినిమాలో అనసూయ పాత్ర ఇలా మెరిసి అలా మాయమవ్వదట. ఆమెది పుల్ లెంగ్త్ క్యారెక్టరే అని.. సినిమాలో ఆమెది కీలక పాత్ర అని.. ‘క్షణం’ సినిమా తరహాలో సినిమాలో ఆమె కీలకంగా ఉంటుందని #rc11 యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఎర్రటి ఎండల మధ్య షూటింగ్ చేస్తోంది సుక్కు అండ్ టీం. ఇది పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా కావడంతో రియల్ లొకేషన్లలోనే చిత్రీకరణ జరుపుతున్నాడు సుక్కు. ఈ చిత్రంలో గ్రామీణ యువకుడిగా కనిపించబోతున్నాడు చరణ్. అతను ఇందులో చెవిటివాడన్న వార్త ఆసక్తి రేకెత్తిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News