ముందు సమంత.. తరువాత అనసూయ

Update: 2017-06-05 11:53 GMT
తెలుగు బుల్లితెరకు యాంకర్ అనసూయ గ్లామర్ పాఠాలు నేర్పింది. టెలివిజన్ షో కోసం హాట్ డ్రెసింగ్ తో రచ్చ చేసి.. అప్పటి నుంచి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన అనసూయ.. ఇప్పుడు సినిమాలతో కూడా సత్తా చాటేస్తోంది. మొదట ఐటెం సాంగ్స్ కు నో చెప్పినా.. ఇప్పుడు వాటితోనూ హంగామా బాగానే చేస్తోంది ఈ హాట్ యాంకర్.

బుల్లితెర.. వెండితెరతో పాటు సోషల్ మీడియా కోసం కూడా స్పెషల్ గా అందాలను అందిస్తుంది అనసూయ. అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండే ఈ సుందరి.. తన గురించిన అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఉదయపూర్ ట్రిప్ వేసిన ఈ భామ.. అక్కడి నుంచి ఓ హాట్ హాట్ పిక్ ను షేర్ చేసింది. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అనసూయ లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫోటో ట్రెండింగ్ అయిపోయింది. స్విమ్మింగ్ పూల్ లో జలకాలు ఆడుతూ.. అందాలు ఆరబోస్తూ అటు తిరిగి ఉన్న పోజ్ ను జనాలకు చూపించి ఊరిస్తోంది అనసూయ. ఇంతలేసి అందాలను చూసిన అబిమానులు ఊరికే ఉంటారా.. అనసూయ సోయగాలను తెగ షేరింగ్స్ చేసేస్తూ హంగామా చేస్తున్నారు.

మొన్న సేమ్ ఇదే తరహాలో ఒక ఇన్ఫినిటీ పూల్ లో నంచుని.. వెనుకనుండి ఇదే విధంగా ఫోజిచ్చింది సమంత. కోసమూయ్ ఐల్యాండ్ నుండి సమంత అలా అల్లాడిస్తే.. ఇప్పుడు అనసూయ ఉదయ్ పూర్ నుండి ఇలా వేడెక్కించింది అంటూ సినిమా లవ్వర్లు మాటలు ఒలకపోస్తున్నారు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News