క్రేజీ మెగా మూవీలో అనసూయ!!
తెలుగు బుల్లితెరకు సంబంధించినంత వరకు హాట్ యాంకర్ అనగానే అనసూయ గుర్తుకు రావాల్సిందే. మరో ఇద్దరు ముగ్గురు ఈ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు కానీ.. అనసూయ స్థాయిని అందుకోవడం మాత్రం జరగడం లేదు. అంతగా బుల్లితెరను.. అంతకు మించి వెండితెరను వేడెక్కించేస్తోంది అనసూయ.
ఇప్పుడీ హాటీకి ఓ మెగా మూవీలో ఛాన్స్ వచ్చిందనే న్యూస్ హాట్ టాపిక్ అయిపోయింది. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన సాయిధరం తేజ్ మూవీ విన్నర్ లో ఈ వయ్యారి భామ.. ఐటెం సాంగ్ లో చిందులేసి మెప్పించింది. అంతలోనే మెగా పవర్ స్టార్ సినిమాలో ఆఫర్ పట్టేయడం షాకింగ్ అనాల్సిందే. విన్నర్ ప్రచారంలో భాగంగా.. మెగా ఫ్యాన్స్ తనపై గుర్రుగా ఉంటున్నారంటూ కామెంట్ చేసిన అనసూయకు.. ఏకంగా రామ్ చరణ్ మూవీలో అవకాశం లభించడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. చెర్రీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో.. ఇప్పటికే అనసూయకు ఓ రోల్ కన్ఫాం అయిపోయిందట.
చెర్రీకి జోడీగా సమంత నటిస్తున్న ఈ సినిమాకి.. ఇప్పటికే ఓ పాట షూటింగ్ పూర్తి చేసేశారు. ఏప్రిల్ 10నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుండగా.. అనసూయ కూడా అదే రోజు నుంచి షూటింగ్ కి అటెండ్ కానుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో.. సీనియర్ నటుడు జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/