సూపర్ స్టార్ రజినీకాంత్ వయసు 66 ఏళ్లు. పైగా కొన్నేళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడేళ్ల కిందట కొన్ని నెలల పాటు విదేశాల్లో చికిత్స తీసుకుని రావడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కూడా అమెరికాలో రెండు నెలలు ట్రీట్ మెంట్ తీసుకుని వచ్చారు. ఇలాంటి స్థితిలో ఆయన షూటింగులు ఎలా చేస్తున్నాడో అని ఆశ్చర్యం కలుగుతోంది జనాలకు. ఐతే ‘కబాలి’ షూటింగ్ లో రజినీ చేసిన స్టంట్లు.. విన్యాసాలు చూసి తమకు దిమ్మదిరిగిపోయిందని అంటున్నారు ఆ చిత్రానికి స్టంట్ మాస్టర్లుగా పని చేసిన కవల సోదరులు అన్బు-అరివు.
మన రామ్-లక్ష్మణ్ బ్రదర్స్ లాగే అన్బు-అరివు కూడా కవలలు పైగా స్టంట్ మాస్టర్లు. ‘కబాలి’ సినిమా కోసం వీళ్లిద్దరూ ఫైట్లు సమకూర్చారు. ఈ సినిమా కోసం రజినీతో పని చేయడం గొప్ప అనుభవమంటున్న ఈ సోదరులు.. షూటింగ్ టైంలో రజినీ ఎనర్జీ చూసి.. ఆయన తీసుకున్న రిస్క్ చూసి చాలా ఆశ్చర్యపోయామని చెప్పారు. ‘‘ముందు మేం డిజైన్ చేసిన స్టంట్లను రజినీ ముందు డెమో చేసి చూపించాం. రజినీ వయసును దృష్టిలో ఉంచుకుని స్టంట్లు కొంచెం నెమ్మదిగా ఉండేలా చేసి చూపించాం. కానీ అలా చేస్తే ఫోర్స్ ఉండదని చెబుతూ.. ఆయన తనదైన స్టైల్లో వేగంగా రిహార్సల్స్ చేసి చూపించారు. షూటింగ్ టైంలోనూ అదే వేగం చూపించారు. ఇక ఆ తర్వాత రిహార్సల్స్ లేవు.. నెమ్మదైన ఫైట్లు లేవు. ఇక సినిమా కోసం ఎక్కడా కూడా బాడీ డబుల్ వాడలేదు. ఎందుకంటే ఇందులోని స్టంట్లన్నీ రియలిస్టిగ్గా ఉంటాయి. బాడీ డబుల్ వాడితే అవి తేలిపోతాయి. ఒక సన్నివేశంలో కారు ప్రమాదకర రీతిలో వేగంగా దూసుకెళ్లే సీన్ ఉంటుంది. ఈ సన్నివేశానికి డూప్ ఆర్టిస్టును వాడతామని చెప్పాం. కానీ రజినీ ఒప్పుకోలేదు. చాలా రిస్క్ ఉన్న ఆ సన్నివేశాన్ని ఆయనే చేశారు. మేమంతా ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయాం. తెరమీద ఈ సన్నివేశాలు చూస్తే ప్రేక్షకులు థ్రిల్లవుతారు’’ అని అన్బు-అరివు తెలిపారు.