యాంకర్‌ ప్రదీప్‌ ఇంట విషాదం

Update: 2021-05-02 06:16 GMT
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాన్ని అందిస్తూ టాప్ యాంకర్ గా నిలిచిన ప్రదీప్ మాచిరాజు ఇంట విషాదం చోటు చేసుకుంది. ప్రదీప్ తండ్రి పాండు రంగ మాచిరాజు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో నిన్న రాత్రి తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. ప్రదీప్ కొన్ని రోజులుగా షో ల్లో యాక్టివ్‌ గా కనిపించక పోవడంతో కరోనా వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆయన తండ్రి అనారోగ్య కారణాల వల్ల షో లనకు అధికంగా హాజరు కావడం లేదని ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు.

ప్రదీప్‌ తండ్రి పాండురంగ కరోనా బారిన పడ్డారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆయన కరోనా వల్ల చనిపోయారా లేదంటే ఇతర అనారోగ్య సమస్యల వల్ల చనిపోయారా అనే విషయమై కుటుంబ సభ్యుల నుండి స్పష్టమైన సమాచారం అందడం లేదు. బుల్లి తెరపై యాంకర్ గా స్టార్‌ హోదా లో ఉన్న ప్రదీప్‌ మాచిరాజు ఇటీవలే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా తో హీరోగా పరిచయం అయ్యాడు. హీరోగా కమర్షియల్‌ సక్సెస్‌ అందుకొని ఫస్ట్ సినిమా తోనే హిట్ హీరో అనిపించుకున్న ప్రదీప్  మంచి  గుర్తింపు దక్కించుకున్నాడు. వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది.

యాంకర్‌ ప్రదీప్‌ తండ్రి మృతి వార్త బుల్లి తెర మరియు వెండి తెర వర్గాలకు దిగ్ర్బాంతిని కలుగ జేసింది. నెట్టింట యాంకర్‌ ప్రదీప్ అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. పలువురు ప్రదీప్ కు ఫోన్‌ చేసి సంతాపం తెలియజేస్తున్నారు. తండ్రి మరణంతో ప్రదీప్‌ కొన్నాళ్ల పాటు బుల్లి తెర షో లకు దూరంగా ఉండే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News