చిత్రపరిశ్రమలో ఉన్నవారు రెగ్యులర్ గా కెమెరా ముందు కనిపించడం కామన్. కానీ అదే సెలబ్రిటీలు ఓ వివాదంలో ఇరుక్కొని కెమెరా కంటపడటం మాత్రం మాములు విషయం కాదు. ఎందుకంటే ఎప్పుడు కెమెరా ముందు యాక్టింగ్ చేస్తూ కనిపించేవారు ఒక్కసారిగా ఏదైనా కేసులో చిక్కుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఆ పరిస్థితి వేరేలా ఉంటుంది. అందులోను అభిమానులకు కాస్త కంగారుతో పాటు అసలు ఏం జరిగిందనే ఆసక్తి కూడా నెలకొంటుంది. తాజాగా అలాంటి వివాదంలోనే చిక్కుకొని వార్తల్లో నిలిచాడు యాంకర్ శ్యామల భర్త నరసింహరెడ్డి. అవును.. అదికూడా ఓ కోటి రూపాయల చీటింగ్ కేసులో ప్రధానంగా నిలిచినట్లు తెలుస్తుంది.
విషయానికి వస్తే.. యాంకర్ శ్యామల భర్త నరసింహ కొన్నాళ్ళ క్రితం కోటి రూపాయలు తీసుకొని ఇంతవరకు చెల్లించకుండా మోసం చేశాడంటూ ఓ మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందట. 2017 నుండి విడతల వారిగా డబ్బులు చెల్లించారని.. కొంతకాలం తర్వాత డబ్బులు అడిగితే నరసింహ బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె పేర్కొందట. డబ్బులు మాత్రమే కాకుండా తనను లైంగికంగా వేధించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే నరసింహతో పాటు బాధితురాలు మరో మహిళ పై కూడా ఫిర్యాదు చేసిందట. ఆమె మధ్యలో ఉంటూ రాయబారం నడిపిందని చెప్పుకొచ్చిందట. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ప్రస్తుతం నరసింహతో పాటు సదరు రాయబారం నడిపిన మహిళను రిమాండ్ కు తరలించినట్లు టాలీవుడ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం యాంకర్ శ్యామల భర్త పై చీటింగ్ కేసు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.