హాట్ యాంకర్ కోసం..స్టార్ యాంకర్ పాట

Update: 2017-02-07 11:53 GMT
బుల్లితెర యాంకర్ గా.. సినిమా కార్యక్రమాల హోస్ట్ సుమ ఎంత ఫేమస్ అనే విషయం తెలిసిందే. నేటివ్ గా మలయాళీ అయిన సుమ.. తెలుగు భాషను చాలా స్వచ్ఛంగా పలుకుతుంది. తెలుగమ్మాయి కాదంటే నమ్మడం కష్టమని అనిపించే సుమ వాయిస్ లో.. చాలానే బేస్ ఎనర్జీ ఉంటుంది. ఆ వాయిస్ ను గుర్తించిన కంపోజర్ ఎస్ ఎస్ థమన్.. ఇప్పుడు ఆమెతో ఓ పాట పాడించేశాడు.

అది కూడా మెగా మూవీ కోసం కావడం ఒక విశేషం అయితే.. మరో హాట్ యాంకర్ అనసూయ చేసిన ఐటెం సాంగ్ కోసం కావడం మరో స్పెషాలిటీ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన సాయి ధరంతేజ్ మూవీ విన్నర్ పాటలను.. స్టార్స్ తో లాంఛ్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు.. సమంతలు ఒక్కో పాటను లాంఛ్ చేయగా.. ఇవాళ సాయంత్రం 7 గంటలకు "సుయ సుయ" అంటూ సాగే పాటను లాంఛ్ చేయనున్నాడు కోలీవుడ్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్.

ఇది ఐటెం సాంగ్ కాగా.. హాట్ యాంకర్ అనసూయ మొదటిసారిగా ఈ మూవీలో ఐటెం సాంగ్ చేసింది. ఆ పాటను సుమ పాడడమే ఈ పాటలో అసలు సిసలైన స్పెషాలిటీ. తేజు-రకుల్ ప్రీత్ జంటగా నటించిన ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను 9వ తేదీన రిలీజ్ చేయనుండగా.. ఈనెల 24న విన్నర్ మూవీని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసింది యూనిట్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News