యాంకర్ శ్యామల ట్యాలెంట్ గురించి తెలుగు ప్రేక్షకులకు బాగానే తెలుసు. టీవీ షోలలో తన ప్రతిభతో ఆకట్టుకోవడం.. అడపా దడపా సినిమాలలో చిన్నపాటి క్యారెక్టర్లలో మెరవడం.. సినిమా ఈవెంట్లను నిర్వహించడం వంటివి చేయడంతో పాటు.. హోమ్లీ గెటప్ అండ్ బిహేవియర్ తో తెలుగు ఆఢియన్స్ కు దగ్గరైంది.
ఈ తరం యాంకర్ల మాదిరిగా తను ఉండనని.. గ్లామర్ యాంగిల్ కు దూరం అంటూ రీసెంట్ గా చెప్పుకొచ్చింది కూడా. ఫ్యామిలీ ఆడియన్స్ శ్యామలను మరీ మరీ మెచ్చడంలో ఇది కూడా ఒక కారణం. అయితే.. తాజాగా వైజాగ్ లో ఛలో మూవీ సక్సెస్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నిటికంటే ఎక్కువగా శ్యామల గెటప్ గురించే జనాలు మాట్లాడుకున్నారంటే ఆశ్చర్యమేమీ కాదు. ఇందుకు కారణం మరీ ఎక్కువేమీ కాకపోయినా శ్యామల చేసుకొచ్చిన గ్లామర్ డ్రెసింగ్. స్లీవ్ లెస్ జాకెట్.. చీరకట్టులో నడుం సోయగాలు.. కొద్ది కొద్దిగా మెరుపులు చూపించింది శ్యామల.
అసలు గ్లామర్ అంటేనే గిట్టదని చెప్పిన కొన్ని రోజులకే ఇలా టర్న్ తీసుకోవడమే ఆశ్చర్యకరం. అయితే.. ప్రస్తుత జనరేషన్ లో ఉన్న పోటీని తట్టుకోవాలంటే.. ఆ పోటీని అధిగమించి అవకాశాలు అందుకోవాలంటే.. ఈ మాత్రం పరిధుల్లో అయినా కాస్త ఎక్స్ పోజింగ్ సిద్ధపడాల్సిందే అనే టాక్ వినిపిస్తోంది. అందుకే శ్యామల ఇలా గెటప్ లో కాసిన్ని ఛేంజెస్ తెచ్చిందట. అదీ సంగతి.