కొత్త టాలీవుడ్ పేరుతో భూదోపిడీ ప‌థ‌క‌మా?

Update: 2018-08-23 04:53 GMT
వైజాగ్ టాలీవుడ్ నిన్న‌టివ‌ర‌కూ ఓ డౌట్. అస‌లు అంత సీనుందా? అన్న‌వాళ్లే ముక్కున వేలేసుకునేలా చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం నుంచి గ్రీన్ సిగ్న‌ల్స్ క‌నిపిస్తున్నాయి. త‌మ‌వారికి దోచి పెట్టేందుకా?  భూముల ధ‌ర్జా దొంగ‌త‌నానికా? అన్న‌ది ప‌క్క‌న‌బెడితే తొంద‌ర్లోనే బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో మ‌రో కొత్త టాలీవుడ్ రూప‌క‌ల్ప‌న‌కు రంగం సిద్ధ‌మైంద‌న్న సంకేతాలందాయి. ఇన్నాళ్లు రాజ‌ధాని నిర్మాణంతో త‌ల బొప్పి క‌ట్టించుకున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం - టాలీవుడ్ నుంచి త‌మ‌కు మాత్ర‌మే ద‌క్కాల్సిన ప‌న్ను వాటాల్ని త‌మ‌ప‌రం చేసుకునే దిశ‌గా తెలివిగా పావులు కదుపుతున్నార‌న్న ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతోంది. ఆ క్ర‌మంలోనే 4కోట్ల లోపు బ‌డ్జెట్ సినిమాల‌కు ఆయాచిత వ‌రాలందించారు.

ఇక‌పోతే వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ ప‌రిస‌రాల్లో 316 ఎక‌రాలు కేవ‌లం స్టూడియోల నిర్మాణానికే కేటాయిస్తున్నామ‌ని - అందుకు జీవో వెలువ‌డ‌నుంద‌ని ఏపీఎఫ్‌ డీసీ అధికారికంగా మీడియాకి నోట్ పంపించ‌డం చూస్తుంటే మ్యాట‌ర్ చాలా సీరియ‌స్‌ గానే ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక వైజాగ్‌ లో ఫిలిం హ‌బ్ ఏర్పాటు మిష‌న్ తో వియ్యంకుడు బాల‌కృష్ణ‌కు భారీగా బ‌హుమానం ఇచ్చేందుకు చంద్ర‌బాబు పావులు క‌దుపుతున్నార‌న్న విమ‌ర్శ‌లు అప్పుడే మొద‌లైపోయాయి. బాల‌య్య‌కు ఊహించ‌న‌న్ని ఎక‌రాలు క‌ట్ట‌బెడ‌తార‌న్న మాటా వినిపిస్తోంది.

ఇదివ‌ర‌కూ 315 ఎక‌రాల‌కు జీవో ఉంది. అప్ప‌ట్లో ఎక‌రా 50ల‌క్ష‌లు ధ‌ర చెప్పారు. ఇప్పుడు ఇంకా ఉన్న ధ‌ర‌ను త‌గ్గించ‌మ‌ని ఎఫ్‌ డీసీ ఛైర్మ‌న్ అంబికా కృష్ణ కోర‌డం వెన‌క ఏంమాయ ఉందో అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. స్టూడియోల నిర్మాణం పేరుతో ప్ర‌స్తుతం రుషి కొండ నుంచి కాపులుప్పాడ‌ - భీమిలి వ‌ర‌కూ అంతా కాస్ట్‌ లీగా మార‌బోతోంద‌ని తెలుస్తోంది. మొత్తానికి బాల‌కృష్ణ‌కు విశాఖ ఫిలిం స్టూడియోస్ పేరుతో ఎన్ని ఎక‌రాలు క‌ట్ట‌బెట్ట‌నున్నారు? అన్న చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా వైర‌ల్ అవుతోంది.
Tags:    

Similar News