సుచీ లీక్స్ తో నా లవ్ బ్రేకప్ అయింది: ఆండ్రియా

Update: 2020-03-29 01:30 GMT
అప్పట్లో సుచీ లీక్స్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సౌత్ ఇండియన్ సినీ హీరోలు - హీరోయిన్ల - ఇతర ఇండస్ట్రీ సంబంధిత స్టార్ల సీక్రెట్ లను లీక్ చేసి ఎన్నో వివాదాలకు దారితీసింది. అందులో భాగంగానే సంగీత దర్శకులకు - హీరోయిన్లకు మధ్య సన్నిహిత సంబంధాలు - లిప్ లాక్స్ పెద్ద దుమారమే రేపాయి. అలాంటి వారిలో హీరోయిన్ ఆండ్రియా - మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. అప్పట్లో వివాదాలు సృష్టించిన వీరి చుంబన దృశ్యాల గురించి రీసెంట్ గా ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు చేసింది. సుచీ లీక్స్ కి ప్రధాన కారణం సింగర్ సుచిత్ర. వీరి రొమాంటిక్ ఫొటోస్ అన్ని ఆమె అకౌంట్ నుండి లీక్ అయినట్లు విధితమే.

అయితే ఆ ఫోటోలపై ఆండ్రియా మాట్లాడుతూ.. అనిరుధ్ కి నాకు ఉన్న సంబంధం నిజమే. కానీ అవి చాలా పాత ఫోటోలు. మా మధ్య అలాంటి సంబంధం ఉండేది. నిజాన్ని నేను కూడా దాచలేదు. సీక్రెట్ గా ఉండాల్సినవి బట్టబయలు కావడమే బాధగా ఉంది. అనిరుధ్ తో నాకు మంచి బాండింగ్ ఉంది. లవ్ లాంటిది కాదు కానీ మంచి బంధమే ఉంది. ఇక లిప్ లాక్ ఫొటోస్ గురించి నేనేం మాట్లాడదల్చుకోలేదు. ఎందుకంటే అవి లీక్ అయిన వెంటనే అనిరుధ్ నన్ను క్షమాపణ అడిగాడు. అవన్నీ అనిరుధ్ కి తెలియకుండా జరిగాయని కూడా నాకు వివరించాడు. ఆ తర్వాత మా ఇద్దరికీ బ్రేక్ అప్ అయింది. కానీ మా ఇద్దరి మధ్య స్నేహం మాత్రం అలానే ఉంది. ఆ వివాదం అనంతరం తనకు నాకు ఎలాంటి మనస్పర్థలు చోటు చేసుకోలేదు' అంటూ వివరించింది ఆండ్రియా.
Tags:    

Similar News