కామెడీని ఆధారం చేసుకుని కమర్శియల్ హిట్లు అందించే దర్శకులు టాలీవుడ్ లో రేర్. ఈ జానర్ లో శ్రీను వైట్ల జమానా కొన్నాళ్లు బాగానే నడించింది. అతన్ని స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టింది ఆ జానర్ సినిమాలే. వెంకీ- ఢీ- రెడీ- కింగ్- దూకుడు వంటివి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు అందుకున్నాయి. ఈ జానర్ కామెడీ తెలుగు ఆడియన్స్ కు కొత్త కావడంతో అప్పట్లో బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఆ జానర్ ని శ్రీనువైట్ల చివరి కంటా విడిచి పెట్టలేదు. తనదైన కామెడీ టింజ్ ని మిస్ చేసుకుని ఓ పిట్ట కథను అల్లి తెరకెక్కించిన ఆగడు- బ్రూస్లీ- మిస్టర్- అమకర్ అక్బర్ ఆంటోనీ లాంటి చిత్రాలు ఎలాంటి ఫలితాలు సాధించాయో తెలిసిందే.
దీంతో శ్రీనువైట్ల కెరీర్ ప్రశ్నార్ధకరంగా మారింది. ప్రస్తుతం అవకాశాలే కరువయ్యాయి. శ్రీను వైట్ల వల్ల విజయాలు అందుకున్న ఏ హీరో ఇప్పుడు అవకాశం ఇవ్వడానికి ముందుకు రాలేదు. కొత్తగా ట్రే చేస్తానన్నా అవకాశమే లేని పరిస్థితి. వైట్ల ఇటీవల జీరో అయిపోవడంతో ఆ ప్లేస్ బ్లాంక్ గా కనిపిస్తోంది. మరి దానిని భర్తీ చేసేందుకు ఎవరైనా దర్శకుడు ఉన్నారా? అంటే.. ఒకే ఒక్క ఆప్షన్ కనిపిస్తోంది.
యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి ని పరిశీలిస్తే శ్రీనువైట్లలోని కామెడీ టింజ్ ని ఉపయోగించుకుని సక్సెస్ దారిలో నే వెళ్తున్నాడని అర్థమవుతోంది. పటాస్- రాజా ది గ్రేట్- ఎఫ్-2 లాంటి బ్లాక్ బస్టర్లు కామెడీ జానర్ స్టోరీలే. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు ఈ తరహానే. ఆదివారం ప్రీ రిలీజ్ వేడుక లో సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ట్రైలర్ ఆద్యంతం కామెడీ యాక్షన్ తో నింపేయడం చూస్తే వైట్లకు ఆల్టర్నేట్ ఆప్షన్ అనే భావించాల్సి వస్తోంది.
ఎఫ్-2 తరహాలోనే ఫ్యామిలీ తరహా కామెడీ ని బాగానే వర్కౌట్ చేసినట్లు కనిపిస్తోంది. సూపర్ స్టార్ తో సైతం కామెడీని బాగానే పండించాడు. ఎఫ్-2 ఇచ్చిన సక్సెస్ కిక్కులో సరిలేరు ట్రైలర్ జోరుగా ట్రెండ్ అవుతోంది. ఒక్క ట్రైలర్ తోనే సినిమా ఎలా ఉండబోతుందో.. అభిమానుల సహా క్రిటిక్స్ ఓ అంచనాకి వచ్చేసారు. శ్రీనువైట్ల లేని ఆ గ్యాప్ ని అనీల్ రావిపూడి ఫుల్ ఫిల్ చేస్తున్న కనిపిస్తోంది. అయితే ఈ కామెడీకి కామన్ ఆడియన్స్ కనెక్ట్స్ కావాలి. కనెక్ట్ అయితే బొమ్మ బ్లాక్ బస్టరే. లేదూ మూసలో వెళుతున్నాడు అనిపిస్తే మాత్రం కష్టం అయిపోతుంది. కామెడీ విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా నెగెటివ్ అవుతుంది. మరి అనీల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు ఏ తీరుగా మెప్పిస్తుంది అన్నది తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.