ఉత్సాహంలో లీకిస్తే క్యురియాసిటీ పోతోందిగా!

Update: 2019-08-04 04:12 GMT
ప్ర‌తిభ‌లో మేటి అని నిరూపించాడు అనీల్ రావిపూడి. `ప‌టాస్‌` నుంచి ఈ యంగ్ డైరెక్ట‌ర్ కెరీర్ కి  తిరుగేలేదు. వ‌రుస విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకుంటూనే వున్నాడు. సినిమాలో క‌థ ఉన్నా లేక‌పోయినా త‌నదైన‌ మార్కు క‌థ‌నం.. కామోడీతో బండిని సాఫీగా లాగించేస్తున్నాడు. హైటెక్ బ‌స్సుల్లో తిరుగుతున్న వాడికి జెట్ ఫ్లైట్ దొరికిన‌ట్టు సూప‌ర్ స్టార్‌ మ‌హేష్ తో `స‌రిలేరు నీకెవ్వ‌రు`  ఛాన్స్ ద‌క్కింది. అప్ప‌టి నుంచి ఉత్సాహం డ‌బుల్ అయ్యింది. మాంచి జోరు మీదున్న అనిల్ రావిపూడి ఈ సినిమా స్టార్టింగ్‌ కి ముందు నుంచి ఫీల‌ర్ల‌ మీద ఫీల‌ర్లు వ‌దులుతూనే వున్నాడు. అదే స్పీడుతో తొలి షెడ్యూల్‌ ని కూడా రాకెట్ స్పీడుతో పూర్తి చేసేశాడు.

అంతా బాగానే వుంది కానీ.. సూప‌ర్ స్టార్ తో  సినిమా చేస్తూ ప్ర‌తి విష‌యాన్నీ బ‌య‌ట‌పెట్టేయ‌డం ఏం బాగాలేద‌నేది క్రిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రేక్ష‌కుల్లో మ‌హేష్ లాంటి స్టార్ హీరో సినిమా అంటే ఎంతో కొంత క్యురియాసిటీని మెయింటెయిన్ చేయాలి. కానీ రావిపూడి అలా చేయ‌డం లేదు. డే వ‌న్ నుంచి సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా సినిమా మొద‌లైన విష‌యం నుంచి మ‌హేష్ క్యారెక్ట‌ర్ పేరు.. హీరో హీరోయిన్ ల రైలు ప్రేమాయ‌ణం.. ఇలా ప్ర‌తీదీ ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట పెట్టేస్తుంటే స‌గ‌టు ఆడియ‌న్‌ కి క్యురియాసిటీ పోతోంది. ఆర్మీ మేజ‌ర్ అన్న స‌స్పెన్స్ ని ఆరంభ‌మే లీక్ చేసేయ‌డంతో అంతా తెలిసిపోయిందిలే అన్న ఫీలింగ్ వ‌చ్చేసింది.

`భ‌ద్ర‌` సినిమాలో ``రెడ్డు ప‌డిన త‌రువాత వీడెళ్లి ఏంచేస్తాడు?`` అని సునీల్ చెప్పిన‌ట్టు సినిమా రిలీజ్‌ కి ముందే అన్నీ చెప్పేస్తే ఇక సినిమాకు రావ‌డం ఎందుకు? అని ప్రేక్ష‌కులు అనుకునే ప్ర‌మాదం ఉంది. అందుకే అత‌డికి అంత అత్యుత్సాహం ఎందుకు? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్. ఈ మాట‌లు అనీల్ రావిపూడి చెవిన ప‌డ్డాయో లేదో?

   

Tags:    

Similar News