షాకింగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన 'ఎఫ్‌ 2' డైరెక్టర్‌

Update: 2019-01-24 07:12 GMT
'పటాస్‌', 'రాజా ది గ్రేట్‌', 'ఎఫ్‌2' ఇలా వరుసగా మాస్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న చిత్రాలను తెరకెక్కించి సూపర్‌ హిట్స్‌ అందుకున్న దర్శకుడు అనీల్‌ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ దర్శకుడు. ఈయనతో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు, ఈయన సినిమాల్లో నటించేందుకు హీరోలు ఆసక్తిగా ఉన్నారు. 'ఎఫ్‌ 2' చిత్రం దాదాపుగా వంద కోట్లు వసూళ్లు చేయడంతో అనీల్‌ రావిపూడి క్రేజ్‌ అమాంతం పెరిగింది. దాంతో ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న బాలయ్య మూవీ త్వరలోనే పట్టాలెక్కే అవకావం ఉంటుందని అంతా భావించారు.

బాలయ్య ప్రస్తుతం చేస్తున్న చిత్రంతో పాటు, ఇప్పటికే కమిట్‌ అయిన సినిమాలు పూర్తి చేసేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. దాంతో అనీల్‌ రావిపూడి అప్పటి వరకు వెయిట్‌ చేయకుండా వెంటనే తన తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు సినిమాలను దిల్‌ రాజు బ్యానర్‌ లో చేసిన అనీల్‌ రావిపూడి ఈ సారి బయట బ్యానర్‌ లో సినిమా చేయబోతున్నాడు. మరీ ఆశ్చర్యకర, షాకింగ్‌ విషయమేంటంటే అనీల్‌ తదుపరి చిత్రం లేడీ ఓరియంటెడ్‌ సబ్జెక్ట్‌ తో తెరకెక్కబోతుంది.

కమర్షియల్‌ సక్సెస్‌ లతో మంచి జోరు మీదున్న ఏ దర్శకుడు కూడా ప్రయోగాత్మకంగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలను చేయాలనుకోడు. కాని అనీల్‌ రావిపూడి మాత్రం లేడీ ఓరియంటెడ్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాడు. తన సబ్జెక్ట్‌ కు సూట్‌ అయ్యే స్టార్‌ హీరోయిన్‌ ను వెదికే పనిలో అనీల్‌ రావిపూడి ఉన్నాడు. అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన అన్ని వివరాలతో వెళ్లడయ్యే అవకాశం ఉంది. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీ అయినా కూడా అనీల్‌ రావిపూడి పూర్తి స్థాయి కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కిస్తాడని ఆశిద్దాం.
Tags:    

Similar News