స్టార్స్ నుండి సాదారణ నటీనటుల వరకు అంతా కూడా వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు సిద్దం అవుతున్నారు. సినిమాల క్రేజ్ రాబోయే రోజుల్లో తగ్గుతుందని భవిష్యత్తు మొత్తం కూడా డిజిటల్ యుగమే అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మహమ్మారి వైరస్ వచ్చి ఎప్పటికో అనుకుంటున్న డిజిటల్ యుగంను ఇప్పుడే తెచ్చింది. ప్రస్తుతం స్టార్ నిర్మాతలు పలువురు వెబ్ సిరీస్ ల నిర్మాణంకు మొగ్గు చూపుతున్నారు. ప్రముఖ తెలుగు నిర్మాత అనీల్ సుంకర ఇటీవల షాడో వెబ్ సిరీస్ తో డిజిటల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.
అనీల్ సుంకర నిర్మాణంలోనే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఒక వైపు షాడో వెబ్ సిరీస్ ను నిర్మిస్తూనే మరో వెబ్ సిరీస్ ను ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో అనీల్ సుంకర నిర్మించబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్ కోసం ప్రకాష్ స్వయంగా స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడట.
సినిమాల షూటింగ్స్ ఎక్కువగా లేకపోవడంతో ఈ విలక్షణ నటుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. హీరోలు హీరోయిన్స్ ఓటీటీ బాట పడుతున్న ఈ సమయంలో తెలుగు ప్రేక్షకులు ముందు ముందు భారీ వెబ్ సిరీస్ లను చూసే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రకాష్ దారిలోనే మరెంత మంది స్టార్స్ వెబ్ సిరీస్ ల దారి పట్టనున్నారో చూడాలి.