'గోవిందుడు అందరివాడేలే' తర్వాత రామ్ చరణ్ చేసే సినిమా గురించి చాలా సస్పెన్స్ నడిచింది. శ్రీనువైట్లతో వెంటనే మొదలైపోతుందనుకున్న సినిమా కాస్తా ఐద నెలల తర్వాత ముహూర్తం జరుపుకుంది. మధ్యలో కథల మార్పిడి.. రచయితల మార్పిడి జరిగింది. హీరోయిన్ విషయంలో కూడా చాలా తర్జనభర్జనలే జరిగి చివరికి రకుల్ ప్రీత్ సింగ్‌కు ఫిక్సయ్యారు. అంతా ఓకే.. ఇక షూటింగ్ స్టార్ట్ అనుకున్న సమయంలో సినిమా గురించి మరో షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఈ సినిమాకు ముందుగా అనుకున్నట్లు తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతాన్నందించట్లేదు.
ఏం జరిగిందో ఏమో కానీ.. అనిరుధ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో వైట్ల, చరణ్‌ల ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ వచ్చేశాడు. బహుశా పారితోషకం విషయంలోనే తేడా వచ్చి ఉంటుందని అనుకుంటున్నారు. ఈ సినిమా కోసం అనిరుధ్ ఏకంగా రూ.2.5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆ మధ్య వార్తలచ్చాయి. ఐతే కథా చర్చలకే కోట్లు ఖర్చవడం.. బడ్జెట్ మరీ ఎక్కువైపోతుండటంతో అంతిచ్చి అనిరుధ్‌ను పెట్టుకోవడం అవసరమా అనుకున్నారట. దేవిశ్రీ కొంచెం తక్కువకే చేస్తాడు. పైగా తీసుకున్నదానికి రెట్టింపు ఔట్‌పుట్ ఇస్తాడు. 'సన్నాఫ్ సత్యమూర్తి' పాటలతో ఎలా ఊపేస్తున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. అందుకే అనిరుధ్‌కు గుడ్‌బై చెప్పేసి దేవిశ్రీకే ఓటేసినట్లు తెలుస్తోంది.