ఇవాళ విడుదలైన యుటర్న్ ప్రమోషనల్ వీడియోలో సమంతా డాన్స్ చేస్తుండగా అనిరుధ్ రవిచందర్ పాట పాడుతూ కనిపించడం చూసి మ్యూజిక్ లవర్స్ ఆశ్చర్యపోయారు. కారణం ఇలాంటి ట్రెండ్ మన సౌత్ లో ఇప్పటి దాకా పెద్దగా లేకపోవడమే. సంగీత దర్శకులు తాము కంపోజ్ చేసిన ట్యూన్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి పారితోషికం తీసుకోవడం సర్వ సాధారణం. కానీ బాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఓ కొత్త ట్రెండ్ ను అనిరుధ్ సౌత్ కు తీసుకొస్తున్నాడు. అదే ప్రమోషనల్ మ్యుజిక్ వీడియో. అంటే సినిమా కథకు సంబంధం ఉన్నా లేకపోయినా అందులో కీలకమైన ఆర్టిస్టులతో స్పెషల్ సాంగ్ ఒకటి షూట్ చేసి ఆన్ లైన్ లో నేరుగా విడుదల చేస్తారన్న మాట. హిందీలో ఇది సర్వ సాధారణం. కానీ తెలుగు తమిళ్ లో ఎవరు ప్రభావం చూపే స్థాయిలో చేయలేకపోయారు. దాన్ని బ్రేక్ చేస్తూ అనిరుధ్ స్పెషల్ ప్యాకేజీల కింద పారితోషికం తీసుకుంటున్నాడట. అజ్ఞాతవాసి టైంలోనే పవన్ కళ్యాణ్ మీద తానే నర్తించి మరీ ఒక స్పెషల్ వీడియో చేసాడు. కాకపోతే దానికి సినిమాలో పాటనే వాడుకున్నాడు తప్ప స్పెషల్ గా కంపోజ్ చేయలేదు. అది సినిమా రిలీజ్ కు ముందు రావడంతో మంచి రెస్పాన్స్ కూడా దక్కింది. దాన్ని కంటిన్యూ చేసే కొత్త ట్రెండ్ ను అనిరుధ్ ఉదృతం చేసేలా కనిపిస్తున్నాడు.
నిజానికి యుటర్న్ సంగీత దర్శకుడు పూర్ణచంద్ర తేజస్వి. కన్నడలో తప్ప తెలుగు తమిళ ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని పేరు. అందుకే బజ్ తేవాలనే ఉద్దేశంతో డాన్స్ యాంతం అని ప్రత్యేకంగా అనిరుధ్ తో పాట కంపోజ్ చేయించడమే కాదు అందులో యాక్టింగ్ డాన్స్ కూడా చేయించారు. మంచి క్రేజ్ ఉన్న అనిరుధ్ చేస్తే ఆటోమేటిక్ గా వైరల్ అవుతుంది కాబట్టి యుటర్న్ మేకర్స్ దీని వైపు మొగ్గు చూపారు. ఇదేమి మొదటిసారి కాదు. గతంలో దేవిశ్రీప్రసాద్ జులాయి టైంలో ఇలాంటి ప్రయోగాలు చేసాడు కానీ అంత ఫలితం ఇవ్వలేదు. ఆల్బమ్ హిట్ అయినా ఈ కాన్సెప్ట్ మనవాళ్లకు కనెక్ట్ కాలేదు. బడ్జెట్ ని బట్టి ఇలాంటి పాటలకు బడ్జెట్ రెమ్యునరేషన్ లెక్కలు ఉంటాయి. ఇప్పుడీ యుటర్న్ వీడియో కనక హిట్ అయితే ఇదో ట్రెండ్ లా మారినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే టీజర్లు ట్రైలర్లు వీడియో సాంగుల వ్యూస్ తో పోటీ ఉంది. ఇప్పుడు ఇవి కూడా లైన్ లోకి వచ్చాయి అంటే వీటి కోసం కూడా అభిమానులు పోటీకి దిగి ట్రెండింగ్ చేసేలా ఉన్నారు.