ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఐదేళ్లు అయినప్పటికీ ఒక సరైన హిట్ కూడా నమోదు చేసుకోలేదు అనిషా ఆంబ్రోస్. ఈమె తరుణ్ భాస్కర్ 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. తనకు ఈ పాత్ర రావడం గురించి, షూటింగ్ గురించి బోలెడు కబుర్లు చెప్పేస్తోంది ఈ చిన్నది. అవేమిటో మనం కూడా చూసేద్దామా..
విశేషం ఏమిటంటే - అనిషానే స్వయంగా పాత్రకోసం సురేష్ ప్రోదక్షన్స్ వారిని కలిసిందట. ఒక్క చాన్స్ అని అడగడంతో వారు ఆడిషన్స్ చేసి రెండు పాత్రల్లో ఒకటి సెలెక్ట్ చేసుకోమనగా - ఈమె షిర్లీ పాత్రను తీసుకున్నా అని చెప్తోంది. ఇది నలుగురు స్నేహితుల కథ. అందరూ తన తోటివారే కావడంతో గోవా లో మొదటి షెడ్యూల్ మొదలయ్యేసరికే తామంతా మంచి స్నేహితులు అయిపోయామని చెప్పింది అనిషా. దర్శకుడు కూడా ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడంతో సెట్లో సర్ - గారు అని సంబోధించకుండా స్నేహితుల్లానే మెలిగేవారం - షూటింగ్ అంతా చాలా ఆహ్లాదంగా , ఆనందంగా గడిచిపోయింది అని చెప్తోంది.
ఒకవేళ ఒక సినిమా ఫ్లాప్ అయితే ఎలా తీసుకుంటారని అడగగా, "సినిమాలు నాకు కేవలం బ్రేక్ మాత్రమే. యాక్టింగ్ నాకు ఒక హాబీ లాంటిది. నాన్న బిసినెస్ ను మరింత వృద్ధి చేయడమే నా కల" అని అంటోంది. ప్రస్తుతం అనిషా చేతుల్లో ఒక తమిళ సినిమా మరొక బైలింగ్వల్ సినిమా ఉన్నాయి.