తెలుగమ్మాయ్ వస్తోంది.. గెట్ రెడీ

Update: 2017-03-03 16:45 GMT
గతేడాది సరైనోడుతో ప్రేక్షకులను ఐటెం గాళ్‌ గా పలకరించిన తెలుగు బ్యూటీ అంజలి.. చాలా కాలం తరువాత ఓ సినిమాతో వస్తోంది. ''చిత్రాంగద'' అంటూ అంజలి నటించిన మూవీ.. ఈ నెల 10న థియేటర్లలోకి వస్తోంది. రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం.. ఎట్టకేలకు రిలీజ్ అవ్వడం విశేషం.

పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ డైరెక్షన్ లో రూపొందిన చిత్రాంగద పోస్టర్లు ఆసక్తి కలిగించేలానే ఉన్నాయి. భయపెట్టే అవతారంలో అంజలి కూడా బాగా టెరిఫిక్ గా ఉంది. ఇక భయపడే పాత్ర కూడా అంజలినే కావడం ఈ మూవీలో అసలు సిసలైన ప్రత్యేకత. స్టోరీలో ఉన్న కీలకమైన ట్విస్ట్ ఇదే అంటున్నాడు దర్శకుడు అశోక్. రిలీజ్ పోస్టర్లను డిఫరెంట్ గా రూపొంది ఆసక్తి కలిగించడంలో చిత్రాంగద యూనిట్ సక్సెస్ అయింది. గతంలో గీతాంజలి అంటూ దెయ్యం సినిమాతో సోలో హిట్ కొట్టిన ఎక్స్ పీరియన్స్ అంజలికి ఉంది.

ఇప్పుడు చిత్రాంగద కూడా  అదే జోనర్ కావడంతో.. జనాల్లో కూడా ఇంట్రెస్ట్ పెరుగుతోంది. పైగా గతేడాది డిక్టేటర్ తోను.. ఆ తర్వాత సరైనోడులో అల్లు అర్జున్ తోను సక్సెస్ లు సాధించి.. అంజలి ఊపు మీదుందనే చెప్పాలి. తమిళ్ లో కూడా వరుస హిట్స్ తో జోరు చూపిస్తున్న అంజలి.. చిత్రాంగదతో మరో హిట్ సాధిస్తుందో లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News