ఆ పుకార్లతో అంజలికి కోపం

Update: 2019-02-25 05:45 GMT
తెలుగమ్మాయి అంజలి హీరోయిన్‌ గా తమిళం మరియు తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తోంది. కొన్నాళ్ల క్రితం ఈమె జై తో ప్రేమలో ఉన్న విషయం అందరికి తెల్సిందే. తమ ప్రేమ విషయాన్ని ఇద్దరు కూడా చెప్పకుండానే చెప్పే ప్రయత్నం చేశారు. ఇద్దరు కలిసి చాలా క్లోజ్‌ గా తిరగడంతో పాటు, ఇద్దరు సహజీవనం వరకు వెళ్లారు అంటూ ప్రచారం జరిగింది. అయితే కారణం ఏంటో కాని ఇద్దరు బ్రేకప్‌ అయ్యారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జై మాట్లాడుతూ ప్రస్తుతానికి తాను సింగిల్‌ అని, కెరీర్‌ పైనే ఎక్కువ దృష్టి పెట్టాను అంటూ ప్రకటించాడు.

జై నుండి విడిపోయిన అంజలి మళ్లీ ప్రేమలో పడ్డదని - ఈ తెలుగమ్మాయి త్వరలో పెళ్లి చేసుకోబోతుంది - పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెప్పే ఆలోచనలో ఉందని అంతా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో అంజలి కాస్త ఘాటుగా స్పందించింది. పెళ్లి వార్తలపై సీరియస్‌ అయ్యింది. పెళ్లి వార్తలు - సినిమాలకు గుడ్‌ బై చెప్ప బోతున్న వార్తలు అన్ని కూడా అవాస్తవం అని తేల్చి పారేసింది.

తాజాగా తనపై వస్తున్న పుకార్లకు స్పందించిన అంజలి.. పెళ్లి అయిన వారే సినిమాల్లోకి వస్తున్న ఈసమయంలో పెళ్లి అయితే సినిమాల్లోంచి వెళ్లి పోవాల్సిన అవసరం ఏంటీ అంటూ ప్రశ్నించింది. అయినా నాకు పెళ్లి అంటూ ఎవరు చెప్పారు, నా పెళ్లి వార్తలు ఏమాత్రం నిజం కాదు. నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను, పెళ్లి చేసుకున్నా కూడా సంతోషంగా సినిమాల్లో కొనసాగుతాను అంటూ చెప్పుకొచ్చింది. పెళ్లి కోసం ఇష్టమైన నటనను ఎందుకు వదులుకుంటానంటూ అంజలి పుకార్లకు క్లారిటీ ఇచ్చింది. అయితే అసలు విషయం అయిన ప్రేమ గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Tags:    

Similar News