‘కబ్ ఆయేగా అస్లీ దివాలీ’ అంటూ టిపికల్ బాడీ లాంగ్వేజ్ తో, చిత్రమైన వాయిస్ తో డైలాగ్ చెప్పి ‘శంకరాభరణం’ ట్రైలర్ కే హైలైట్ అయింది అంజలి. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన అంజలి పోస్టర్లు కూడా చాలా డిఫరెంటుగా, సెన్సేషనల్ గా ఉండి జనాల్లో ఆసక్తి రేపాయి. ఇప్పటిదాకా అంజలి సాఫ్ట్ క్యారెక్టర్ లలోనే చూసిన జనాలకు ‘శంకరాభరణం’లో ఆమె పోషించిన బందిపోటు రాణి పాత్ర షాకివ్వబోతోందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఐతే సినిమాలో ఆమె పోషించింది ఫుల్ లెంగ్త్ క్యారెక్టరేమీ కాదట. ఆమె పాత్ర 15-20 నిమిషాలే ఉంటుందని.. ఐతే ఉన్నంత సేపూ ఆ క్యారెక్టరే తెరమీద బాగా హైలైట్ అవుతుందని అంటున్నాడు నిఖిల్.
‘‘సినిమాను ఒంటి చేత్తో నడిపించే హీరోయిన్లు చాలా కొద్ది మందే ఉంటారు. అంజలి అలాంటి హీరోయినే. హిందీలో నేహా ధూపియా పోషించిన పాత్రను అంజలి చేస్తోంది. ఆమె పాత్ర కనిపించేది 15-20 నిమిషాలే అయినా దాని ఇంపాక్ట్ మాత్రం చాలా ఉంటుంది. సినిమా చూశాక అందరూ ఈ పాత్ర గురించి మాట్లాడుకుంటారు. తెరమీద అంజలిని చూసి జనాలు షాకవుతారు’’ అని చెప్పాడు నిఖిల్. క్యారెక్టర్ చిన్నదే అయినప్పటికీ కోన వెంకట్ మీద ఉన్న అభిమానంతోనే అంజలి ఆ పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. ఐతే తక్కువసేపే కనిపించినా బాగా హైలైట్ అయ్యేలాగా ప్రత్యేక శ్రద్ధతో అంజలి పాత్రను తీర్చిదిద్దాడట కోన.