దెయ్యాల సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యిందే!

Update: 2019-07-12 05:11 GMT
పేరుకు తెలుగమ్మాయే కానీ తమిళ్ లోనే బాగా సెటిల్ అయిన హీరోయిన్ అంజలి టాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తోంది కానీ ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. వెంకటేష్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో టైటిల్ రోల్ చేసినా తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేదు. హారర్ కామెడీ జానర్ లో ట్రై చేసిన గీతాంజలి మాత్రం తనకు మంచి బ్రేక్ ఇచ్చింది. అయితే అక్కడితో మొదలుకుని ఇప్పటిదాకా అంజలి అన్ని అలాంటి తరహా సినిమాలే చేయడం గమనార్హం.

దాని తర్వాత చిత్రంగద- శంకరాభరణం- బెలూన్ - లీసా అన్ని ఇలా దెయ్యాల కథలే క్యూ కట్టి చేసేసింది. ఇందులో కొన్ని తమిళ్ లో పర్వాలేదు అనిపించగా తెలుగులో ఆడింది మాత్రం ఏ ఒక్కటీ లేదు. ఇప్పుడు మరోసారి హారర్ కు రెడీ అయిపోయింది అంజలి. కృష్ణన్ జయరాజ్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ మూవీలో కోలీవుడ్ పాపులర్ కమెడియన్ యోగిబాబు ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు.

ఇది కూడా ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టని తెలిసింది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించబోతున్న ఈ మూవీలో డార్క్ హారర్ ఎక్కువగా ఉంటుందట. ఈ దర్శకుడి కాంబినేషన్ లోనే అంజలి గతంలో బెలూన్ చేసింది. ఇప్పుడు ఇది దాన్ని మించే స్థాయిలో తీర్చిదిద్దే పనిలో ఉన్నారట. అనుష్క సైలెన్స్ లో కూడా కీలక పాత్ర చేస్తున్న అంజలి స్టార్ హీరోల సరసన కనిపించకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఇలా దెయ్యాల సినిమాలతో కెరీర్ ని లాక్కు రావడం విశేషం.


Tags:    

Similar News