సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వివాదం ఏ స్థాయిలో చెలరేగిందో తెలిసిందే. ఈ పద్ధతికి వ్యతిరేకంగా 'మీటూ' ఉద్యమం కూడా నడిచింది. ఆ సమయంలో చాలా మంది తమకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తాజాగా.. మరో నటి తనకు జరిగిన సంఘటనను వివరించింది.
బాలీవుడ్ నటి, దివంగత నటుడు సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే తనకు సౌత్ ఇండస్ట్రీలో ఈ అనుభవం ఎదురైందని తెలిపింది. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించింది. దక్షిణాది నుంచి తనకు ఓ సినిమా ఆఫర్ వచ్చిందని, అక్కడికి వెళ్తే.. ఓ స్టార్ హీరో తనను గదిలోకి పిలిచి 'కాంప్రమైజ్' అవుతావా? అని అడిగాడని చెప్పింది.
అయితే.. అందులోని అంతరార్థాన్ని గుర్తించి, తాను పార్టీలకు డిన్నర్లకు ఏమైనా రావాలా? అని ప్రశ్నించానని చెప్పింది. దీనికి.. ఆ స్టార్ హీరో మౌనంగా ఉండిపోయాడట. ఆ తర్వాత అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి, బయటకు వచ్చానని తెలిపింది అంకితా. ఆ సినిమా ఛాన్స్ రాదని ఆ క్షణమే తనకు అర్థమైందని, నిజంగా కూడా అదే జరిగిందని చెప్పింది. కాగా.. ఆ స్టార్ హీరో, నిర్మాత పేర్లు మాత్రం బయటపెట్టలేదు అంకితా.