బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే పెళ్లి కూతురయ్యింది. తాను పెళ్లి చేసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించి.. అందుకు సంబంధించిన ఫొటోలను మరియు వీడియోలను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పూత్ తో అంకితా సుదీర్ఘ కాలం పాటు ప్రేమాయణం సాగించింది.
ఇద్దరి కెరీర్ కూడా దాదాపుగా ఒకే సమయంలో ప్రారంభం అయ్యింది. బుల్లి తెరపై వీరిద్దరు సందడి చేసిన విషయం ఉత్తరాది ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. సుశాంత్ సింగ్ మరియు అంకితా లు కెరీర్ పై దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతో బ్రేకప్ అయ్యారు. విడి పోయిన తర్వాత కూడా ఇద్దరు మంచి స్నేహితులుగా కొనసాగిన విషయం తెల్సిందే.
సుశాంత్ మృతి సమయంలో అంకితా లోఖండే ను చాలా మంది ట్రోల్ చేశారు. ఆ సమయంలో సుశాంత్ తో బ్రేకప్ వల్లే ఈ పరిస్థితి అంటూ కొందరు ఆమెను తప్పుబట్టారు. ఆమె సుశాంత్ ను వీడి చాలా కాలం అయ్యింది.. ఆ తర్వాత ఆమె మరో వ్యక్తితో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్దంగా ఉంది.
ఆ సమయంలో ఆమెను ట్రోల్ చేయడంతో ఇండస్ట్రీ వర్గాల వారు కొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. సుశాంత్ సింగ్ మృతి వ్యవహారంలో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని స్వయంగా ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
అయినా కూడా సుశాంత్ అభిమానులం అంటూ చెప్పుకున్న కొందరు ఆమెను తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడం జరిగింది. కొన్నాళ్ల పాటు అంకితా తన సోషల్ మీడియా పేజీలను డీ యాక్టివేట్ చేసినట్లుగా కూడా బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది.
అంకితా మరియు సుశాంత్ ల బ్రేకప్ తర్వాత పలు పరిణామలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో విక్కీ జైన్ తో అంకితా ప్రేమలో పడింది. వీరిద్దరి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కరోనా వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలన్నా కూడా సుశాంత్ సింగ్ మృతి కాస్త వారికి ఇబ్బందిని కలిగించాయి.
ఎట్టకేలకు సుశాంత్ సింగ్ వ్యవహారం సైలెంట్ అవ్వడం.. ఆయన అభిమానులు అంకితాను వదిలేయడంతో విక్కీ జైన్ తో ఆమె పెళ్లి అయ్యిందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వీరిద్దరి జంట బాగుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీ ప్రముఖులు వీరికి ఆశీర్వాదాలు అందించారు. మొత్తానికి సుశాంత్ సింగ్ రాజ్ పూత్ జీవితం అర్థాంతరంగా ముగియగా ఆయన మాజీ ప్రియురాలు.. స్నేహితురాలు అయిన అంకితా జీవితంలో కొత్త అడుగులు వేసింది. ఈ జర్నీ లో ఆమె సంతోషంగా ఉండాలని ఆశిద్దాం.