సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన అన్నాత్తే సినిమా ఇటీవలే దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా చిత్రీకరణ మొదలు అయ్యినప్పటి నుండి అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను శివ తెరకెక్కిస్తున్నట్లుగా మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. సినిమా విడుదల తర్వాత మిశ్రమ స్పందన వచ్చింది. తెలుగు లో ఈ సినిమాను పెద్దన్న టైటిల్ తో విడుదల చేయడం జరిగింది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను అట్టర్ ప్లాప్ చేశారు. మరీ దారుణంగా ఇలా ఉందేంటి అంటూ విమర్శలు గుప్పించారు. ప్రముఖ స్టార్స్ ఉన్నా కూడా ఈ సినిమా పాత చింతకాయ పచ్చడి మాదిరిగా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సినిమాలు పాతికేళ్ల ముందు తీస్తే చూశారు.. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు అంటూ తెలుగు విశ్లేషకులు కామెంట్స్ చేశారు.
అన్నాత్తే సినిమాను మాత్రం తమిళనాట జనాలు ఒక మోస్తరుగా ఆధరిస్తున్నారు. అక్కడ రజినీకాంత్ కు మరియు శివకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. చిత్ర యూనిట్ సభ్యులు భారీ ఎత్తున వసూళ్లను ప్రచారం చేస్తున్నారు. అయితే అంత సీన్ లేదని మాత్రం కోలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల వారు ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు. సినిమా పబ్లిసిటీ కోసం కలెక్షన్స్ పెంచి చెప్పడం కామన్ విషయం. ఇది తెలుగు సినిమా పరిశ్రమలో ఉందనే విషయం తెల్సిందే. ఆ మద్య ఒక నిర్మాత స్వయంగా మీడియాతో మాట్లాడుతూ అంత వసూళ్లు రానేరావు.. మేము పబ్లిసిటీ కోసం మాత్రమే ఎక్కువ చేసి చెప్తామని చెప్పుకొచ్చాడు. పబ్లిసిటీ కోసం తాము చేసే ఈ జిమ్ముక్కులను జనాలు నమ్ముతున్నారని ఆయన అన్నాడు.
ఇప్పుడు అదే పబ్లిసిటీ జిమ్మిక్కును అన్నాత్తే సినిమా కోసం వాడుతున్నట్లుగా అనిపిస్తుంది. తమిళనాట సినిమా వసూళ్లు పెద్దగా వస్తున్న దాఖలాలు లేవు. అయినా కూడా 50 కోట్లు.. 60 కోట్లు అంటూ వసూళ్లను యూనిట్ సభ్యులు మరియు పీఆర్ టీమ్ అక్కడి మీడియా సంస్థలు చెబుతున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే ఒక మోస్తరు వసూళ్లు నమోదు అవ్వడం చాలా కామన్ విషయం. కాని ప్లాప్ అయినా కూడా ఇలా భారీ వసూళ్లు నమోదు అవ్వడం మాత్రం ఖచ్చితంగా నిజం అయ్యి ఉండదు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే అన్నాత్తే టీమ్ కూడా తెలుగు నిర్మాతల పబ్లిసిటీ స్టంట్ అయిన రికార్డు కలెక్షన్స్ ను వినియోగిస్తున్నారేమో అనిపిస్తుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటీ అనేది ఆ అన్నాత్తే కే తెలియాలి.