మ‌ళ్లీ వ‌చ్చేస్తున్న ర‌జ‌నీ కాంత్‌.. మిగిలింది వారం రోజులే!

Update: 2021-02-09 03:30 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా రోజుల గ్యాప్ త‌ర్వాత సినిమా సెట్స్ లో అడుగు పెట్ట‌బోతున్నారు. శివ దర్శకత్వంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న సినిమా ‘అన్నాత్తే’. గతేడాది హైదరాబాద్ షూటింగ్ సమయంలో అనారోగ్యం పాలైన రజనీకాంత్.. సినిమా చిత్రీకరణను అర్ధంతరంగా నిలిపేసి చెన్నై వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత తాను రాజకీయాల్లోకి రావట్లేదంటూ సంచలన ప్రకటన చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ ప్రకటన అటు తమిళ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేయ‌గా.. అభిమానుల గుండెల‌ను పిండేసింది. ఈ గాయం నుంచి ఫ్యాన్స్ ఇప్ప‌డిప్పుడే కోలుకుంటుండ‌గా.. త‌మిళ‌నాట ప‌రిస్థితులు కూడా సాధార‌ణ స్థితికి చేరుకుంటున్నాయి.

ఇక‌, ర‌జ‌నీకాంత్ కూడా పూర్తి ఆరోగ్య‌వంతుల‌య్యారు. దీంతో.. అన్నాత్తే షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌య్యారు ర‌జ‌నీ. ఈ మేర‌కు మేక‌ర్స్ స‌మాచారం కూడా ఇచ్చేశారు. వ‌చ్చే వారంలో షూటింగ్ పెట్టుకుందామ‌ని చెప్పార‌ట సూప‌ర్ స్టార్‌. వాస్త‌వానికి అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగితే ఫిబ్ర‌వ‌రి నాటికే షూట్ కంప్లీట్ చేసి, మార్చి లేదా ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయాలనుకున్నారు మేక‌ర్స్‌. కానీ.. మొత్తం త‌ల‌కిందులైంది.

కాగా.. షూటింగ్ ప్రారంభ‌మైన త‌ర్వాత మొద‌ట‌గా ఇంటర్వెల్ సీన్స్ ను షూట్ చేస్తారని స‌మాచారం. ఆ తరువాత రజని – ఖుష్బూ మధ్య వచ్చే ఫ్యామిలీ సీన్స్ తీస్తారని తెలుస్తోంది. కాగా.. ఈ సినిమా కోసం బరువు తగ్గిన ఖుష్బూ.. సరికొత్తగా రెడీ అయ్యార‌ని టాక్‌. మ‌రి, ఈ షూట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News