సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు-2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 1996లో విడుదలైన భారతీయుడు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదుచేసి అటు కమల్ హాసన్ కెరీర్లో.. ఇటు డైరెక్టర్ శంకర్ కెరీర్లో మైలురాయిగా నిలిచింది. లంచం తీసుకొని పనిచేసే వారిపై.. అవినీతిని అరికట్టించే ఓ సామాన్యుడి ఎత్తుగడల ప్రధానాంశంగా ఫస్ట్ పార్ట్ భారతీయుడు రూపొందించారు మేకర్స్. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా డైరెక్టర్ శంకర్.. కమల్ హాసన్ మరోసారి జతకట్టారు. ఆ సినిమా సీక్వెల్ 'భారతీయుడు 2' చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభం అప్పటినుండి అనుకోని ఆటంకాలను ఎదుర్కొంటూనే ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆటంకాలు ఆపేస్తూనే ఉన్నాయి.
గతేడాది ఫిబ్రవరి నెలలో క్రేన్ విరిగిపడి షూటింగ్ స్థలంలో ఘోరమైన ప్రమాదం జరిగింది. దాని నుండి కోలుకొని మళ్లీ షూటింగ్ ప్రారంభించేలోపు కరోనా వైరస్ లాక్ డౌన్ తెచ్చేసింది. దాని వలన అనుకున్న షెడ్యూల్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయట. అయితే ప్రస్తుతం ప్రభుత్వాలు సినిమా షూటింగులకు అనుమతులు ఇవ్వడంతో త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే ఏర్పాట్లు చేస్తుంది డైరెక్టర్ శంకర్ బృందం. అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో టెక్నీషియన్ వెళ్లిపోయాడట. ఆయనే డిఓపి రత్నవేలు. ఆల్రెడీ రవివర్మన్ అనుకుంటే ఆయన వెళ్ళిపోయి రత్నవేలు వచ్చాడు. ఇప్పుడు సినిమా పరిస్థితి ఏంటో అర్ధంగాక రత్నవేలు కూడా చిత్రం నుండి తప్పుకున్నట్లు సమాచారం. మరి సినిమా ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేదు. అయితే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చూడాలి మరి డైరెక్టర్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో!