ఎన్టీఆర్ కోసం మరో హిట్ డైరెక్టర్?

Update: 2022-11-01 02:30 GMT
సినిమా ఇండస్ట్రీలో అందరి దర్శకులకు కూడా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని చాలా కోరికగా ఉంటుంది. ఒక్క సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న చిన్న దర్శకులకు కూడా ఎన్టీఆర్ ను కలుసుకోవాలని ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో దాదాపు అన్ని రకాలుగా ఆల్ రౌండర్ అనిపించుకున్న అతికొద్ది మంది హీరోలలో ఎన్టీఆర్ టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు.

అందుకే అతనితో సినిమా చేయాలని చిన్న దర్శకుల నుంచి అగ్ర దర్శకుల వరకు చాలా బలంగా కోరుకుంటూ ఉంటారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడున్న పరిస్థితులలో ఎంతో ఆలోచించి తన తదుపరి ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. RRR సినిమా సక్సెస్ కావడంతో ఎన్టీఆర్ ఇప్పుడు తన పూర్తి ఫోకస్ ని కూడా కొరటాల శివ ప్రాజెక్టు పై పెట్టాడు. ఎన్టీఆర్ 30వ ప్రాజెక్టుగా తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే హై రేంజ్ లోనే ఉన్నాయి.

ఇంకా ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ లిస్టులో ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయిపోయాడు. కానీ ఆ ప్రాజెక్టు రావడానికి ఇంకాస్త ఎక్కువ సమయం పట్టే ఛాన్స్ ఉంది. అలాగే మధ్యలో బుచ్చిబాబు కూడా ఉన్నాడు. కానీ కథ అయితే ఇంకా ఫైనల్ కాలేదు. దీంతో బుచ్చిబాబు రామ్ చరణ్ వైపు యూ టర్న్ తీసుకున్నట్లు కూడా ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

ఇక ఈ క్రమంలో ఇటీవల సీతారామం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న హను రాఘవపూడి ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. వైజయంతి మూవీస్ అదే దర్శకుడికి మరొక ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా వైజయంతి మూవీస్ లో ఎప్పటినుంచో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు.

కాబట్టి ఈ కాంబినేషన్ లో ఒక ప్రాజెక్టు సెట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కానీ ముందుగా కథ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్ ఇండియా రేంజ్ లోనే సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు. కాబట్టి దర్శకుడు హను అంచనాలకు తగ్గట్టుగా ఉండే కథతో మెప్పించాల్సి ఉంటుంది. మరి ఆ దర్శకుడు ఎలాంటి కథతో మెప్పిస్తాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News