'సలార్' కాంబోలో మరో పాన్ ఇండియా మూవీ..?

Update: 2021-03-23 09:43 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - 'కేజీఎఫ్‌' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ''సలార్''. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్‌ కిరగందూర్‌ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 2022 ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రభాస్ - ప్రశాంత్ కాంబోలో 'సలార్' తర్వాత మరో పాన్ ఇండియా మూవీ చేయడానికి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

దిల్ రాజు బ్యానర్ లో ప్రభాస్ ఇంతకముందు 'మున్నా' 'మిస్టర్ పర్ఫెక్ట్' వంటి సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో హ్యాట్రిక్ మూవీ కోసం చాన్నాళ్ల క్రితమే ప్రభాస్ కు దిల్ రాజు అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే సరైన డైరెక్టర్ దొరక్కపోవడంతో ఈ ప్రాజెక్ట్ సెట్ అవలేదు. అదే సమయంలో డార్లింగ్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ బిజీగా మారిపోయాడు. అప్పటి నుంచి ప్రభాస్ కోసం దర్శకుడిని వెతికే పనిలో ఉన్న దిల్ రాజు.. చివరకు ప్రశాంత్ నీల్ ని సెట్ చేసినట్లు టాక్ నడుస్తోంది.  

ఇటీవలే ప్రశాంత్ నీల్ తో చర్చలు జరిపిన దిల్ రాజు.. ఆయనకు భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చారట. 'సలార్' సినిమాని ప్రశాంత్ నీల్ తీస్తున్న విధానం నచ్చి ప్రభాస్ సైతం అతనితో మళ్ళీ వర్క్ చేయడానికి ఒప్పుకున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ - ప్రశాంత్ ఇద్దరూ కమిటైన సినిమాలు పూర్తైన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అంటే 2023లో 'సలార్' కాంబోలో మరో సినిమా పట్టాలెక్కనుందని అనుకోవాలి.
Tags:    

Similar News