ఒమిక్రాన్ టెన్షన్స్ నడుమ ఉత్తరాది రాష్ట్రాల్లో 50శాతం ఆక్యుపెన్సీ రూల్ పాస్ అయ్యింది. మహారాష్ట్ర సహా దక్షిణాదిన కేరళ-కర్నాటక-తమిళాడు సహా పలు చోట్ల 50శాతం ఆక్యుపెన్సీ నియమం .. కోవిడ్ ప్రోటోకాల్ పాటించాల్సిందేనని ప్రభుత్వాలు నియమాల్ని ప్రవేశపెట్టాయి.
ఇది భారీ పాన్ ఇండియా చిత్రాల రిలీజ్ లకు చెక్ పెట్టింది. ముఖ్యంగా ఈ పరిణామం మోస్ట్ అవైటెడ్ 2022 మూవీ ఆర్.ఆర్.ఆర్ కి పెద్ద నిరాశను మిగిల్చింది. జనవరి 7 రిలీజ్ అంటూ ప్రకటించేసిన రాజమౌళి అండ్ టీమ్ డెడ్ లైన్ ప్రకారం ప్రొడక్ట్ ని రెడీ చేశారు. ప్రచారాన్ని హోరెత్తించారు. ముంబై-చెన్నై-బెంగళూరు సహా పలు చోట్ల ప్రచారం నిర్వహించారు. కానీ ఇంతలోనే ఒమిక్రాన్ బెంబేలెత్తించింది. రోజుకు 20వేల కేసులు ఇండియాలో నమోదవ్వడం టెన్షన్ పెడుతోంది. దీంతో పబ్లిక్ ప్లేసులకు ముఖ్యంగా థియేటర్లకు వెళ్లే వాళ్లకు టెన్షన్ మొదలైంది. ఆర్.ఆర్.ఆర్ ని వాయిదా వేయక తప్పలేదు అంటూ కొద్ది సేపటి క్రితమే టీమ్ ప్రకటించింది.
ఇంతలోనే జనవరి 7న రానా నటించిన 1945 మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాత సి.కల్యాణ్ ప్లాన్ చేస్తున్నారంటూ టాక్ వినిపించింది. ``2022 నూతన సంవత్సరంలో ఒక మంచి నిర్ణయం.. మీ సినిమా సక్సెస్ కి పునాది వేస్తుంది. 31 వ తేదీ నుండి జనవరి 7 వ తేదీకి 1945 మూవీని పోస్ట్ ఫోన్ చేసుకున్నాం. రానా నటించిన 1945 మూవీ జనవరి 7న విడుదలవుతోంది. అల్ ది బెస్ట్ సి.కళ్యాణ్ అంటూ ఒక సంక్షిప్త సందేశం వైరల్ అవుతోంది.
అన్నట్టు ఆ మూవీ ఉందని మర్చిపోయిన మీడియా జనం ప్రజలు కూడా ఇప్పుడు మళ్లీ గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రకరకాల వివాదాలతో 1945 మూవీ ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయింది. మరి ఇప్పుడు నిర్మాత రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని లీకులిచ్చారు. అయితే రానా మాత్రం దీనిపై స్పందించింది లేదు.
ఇంతకీ వివాదమేమిటి అంటే?
1945 మూవీ నిర్మాత రాజరాజన్ (సి.కళ్యాణ్ సమర్పణ)తో హీరో రానా విభేధాలపై ఇంతకుముందు మీడియాలో కథనాలొచ్చాయి. సినిమా పూర్తయింది. రిలీజ్ చేస్తున్నాం!! అంటూ అప్పట్లో దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయడంతో రానా ఖంగు తిన్నాడు. పూర్తి కాని సినిమాని రిలీజ్ చేస్తారా? అంటూ ఫస్ట్ లుక్ ప్రకటన చూసి షాకయ్యాను. నేను ఏడాది కాలంగా ఎవరినీ కలవలేదు. పారితోషికాలు పూర్తిగా చెల్లించలేదు. చాలా వరకూ సినిమా పెండింగులో ఉంది. నా పాత్రను చిత్రీకరించాల్సినది చాలా ఉంది... అంటూ రానా ఓపెనయ్యారు.
ఒకవేళ సినిమా పూర్తి కాకుండానే రిలీజ్ చేయాలని భావిస్తే గనుక నేను చట్టపరంగా చర్యలు తీసుకుంటాను అని హెచ్చరించారు రానా. అతడు చెబుతున్న దానిని బట్టి సినిమా ఇంకా పూర్తవ్వలేదనే భావించారు. అయితే మరోవైపు దర్శకుడు సత్య శివ వెర్షన్ వేరొకలా వినిపించింది. ``సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఔట్ పుట్ విషయంలో నేను హ్యాపీగా ఉన్నాను. కంటెంట్ బాగా వచ్చింది. రానా ఇప్పటికే తమిళ వెర్షన్ డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. అయితే నిర్మాతతో రానాకు ఏవో అపార్థాలు వచ్చాయి. వాటిని పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను`` అని తెలిపాడు.
శాటిలైట్ రైట్స్ ఇప్పటికే అమ్ముడు పోయాయి కాబట్టి ఇద్దరి మధ్యా అపార్థాలు తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలి అని అన్నారు. అయితే దర్శకుడు ఒకలా.. రానా ఏమో ఇంకోలా అనడం రకరకాల కన్ఫ్యూజన్ లకు తావిచ్చింది. తాజాగా ఇదే మూవీ గురించి సి.కళ్యాణ్ సన్నిహిత వర్గాలు లీకులివ్వడం చూస్తుంటే ఆ మూవీని రిలీజ్ చేస్తున్నారా? అంటూ చర్చ తిరిగి కొనసాగుతోంది.