'ది క‌శ్మీర్ ఫైల్స్' డైరెక్ట‌ర్ మ‌రో సంచలన చిత్రం!

Update: 2022-11-08 12:30 GMT
కశ్మీరీ పండిట్ల ఊచ‌కోత నేప‌థ్యంలో వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం `ది క‌శ్మీర్ ఫైల్స్‌`. అనేప‌మ్ ఖేర్‌, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, ప‌ల్ల‌వి జోషీ వంటి తార‌లు న‌టించిన ఈ మూవీ ఓ డాక్యుమెంట‌రీ అని అని అంతా అనుకున్నారు కానీ ఊహ‌కంద‌ని స్థాయిలో ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టిం చింది. 15 కోట్ల పై చిలుకు బ‌డ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది.

కశ్మీరీ పండిట్ల ఊచ‌కోత నేప‌థ్యంలో 1989 - 90 మ‌ధ్య కాలంలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల‌కు స‌జీవ సాక్ష్యంగా నిలిచిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 340 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి బాలీవుడ్ మేక‌ర్స్ తో పాటు అన్ని భాష‌ల‌కు చెందిన మేక‌ర్స్ ని, ట్రేడ్ వ‌ర్గాల‌ని ఒక్క‌సారిగా షాక్ కు గురిచేసింది. ఈ మూవీని తెలుగు ప్రొడ్యూస‌ర్ అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించారు. ఈ మూవీతో ద‌ర్శ‌కుడు వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్ దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యారు.

ఇలాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత మ‌ళ్లీ వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్ క‌లిసి ఓ సంచ‌ల‌న సినిమాకు ప‌ని చేయ‌బోతున్నారు. ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన టైటిల్ ని మీరే గెస్ చేయండి అంటూ ద‌ర్శ‌కుడు వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి సోష‌ల్ మీడియా వేదిక‌గా మంగ‌ళ వారం ఓ పోస్ట్ ని షేర్ చేస్తూ వెల్ల‌డించారు. `ది -- వార్‌` ఫిల్ ఇన్ ద బ్లాక్ అంటూ సినిమా టైటిల్ ఏంటో మీరే గెస్ చేయండ‌ని ప్రేక్ష‌కుల‌కు ప‌జిల్ విసిరారు.

ఈ సినిమాతో మ‌రో క్లిష్ట‌మైన‌, స‌మ‌స్యాత్మ‌క‌మైన క‌థ‌నే వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్ లు ఎంచుకున్న‌ట్టుగా తెలుస్తోంది. `ది .. వార్‌` అనే అక్ష‌రాల‌ని బ‌ట్టి ఇది ఇండో పాక్ వార్ నేప‌థ్యంలో సాగే సినిమా అని కొంత మంది.. కార్గిల్ వార్ అని కొంత మంది ట్వీట్ చేస్తున్నారు. ఇంత‌కీ వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్ ఏ వార్ ని బేస్ చేసుకుని ఈ మూవీని తెర‌పైకి తీసుకురానున్నార‌న్నది త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.

ఇటీవ‌ల వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ని ప్ర‌త్యేకంగా క‌లిసి త్రిదేవ్ ఆఫ్ ఇండియ‌న్ సినిమా క‌మింగ్ అప్ అంటూ ట్వీట్ చేస్తూ ప‌లు ఫొటోల‌ని షేర్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో `ది --వార్‌` అంటే వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్ ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సుకుమార్ ఈ మూవీ కోసం ప‌ని చేయ‌బోతున్నారా? ..  ఇంత‌కీ ఈ సినిమా క‌థేంటీ అనేది స‌రికొత్త చ‌ర్చ‌కు తెర తీస్తోంది. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంద‌ని, టైటిల్ తో పాటు ఇత‌ర వివ‌రాల్ని ద‌ర్శ‌కుడు వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి వెల్ల‌డించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News