RRR చిత్రానికి కొత్తగా మరో తలనొప్పి..?

Update: 2022-03-16 15:05 GMT
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ''ఆర్ ఆర్ ఆర్'' రిలీజ్ కు రెడీ అయింది. కరోనా పాండమిక్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. మార్చి 25న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్ లలో విడుదలవుతున్న సినిమాగా RRR నిలవనుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ మూవీ దూసుకుపోతోంది. యూఎస్ ప్రీ బుకింగ్ సేల్స్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా మేకర్స్ కు తీపికబురు వచ్చింది.

RRR టిక్కెట్ ధరను 100 రూపాయలు పెంచడానికి జగన్ ప్రభుత్వం అనుమతించింది. అలానే ఇటీవల వచ్చిన జీవో ప్రకారం ఐదో షోకి పర్మిషన్ ఉండటం కలిసొచ్చే అంశం. ప్రభుత్వ మద్దతుతో ఏపీలో ఈ సినిమా భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది.

అయితే ఆంధ్రా నుంచి శుభవార్త వచ్చిందని సంతోషపడే లోపు.. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో 'ఆర్.ఆర్.ఆర్' కు మరో కొత్త తలనొప్పి మొదలైంది. తాజా వార్తల ప్రకారం, మొదటి వారం షేర్ 55% ఉంటేనే సినిమాను ప్రదర్శిస్తామని FEUOK (ది ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ) డిస్ట్రిబ్యూటర్లను హెచ్చరించిందని తెలుస్తోంది.

లాభాల మార్జిన్లు పరిమితం కావడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు ఇది చాలా కష్టమైన పని. కేరళలో చాలా మంది చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు సినిమా హక్కులను పొందేందుకు భారీ ఖర్చు పెట్టారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లు సహకరించడం లేదన్న ఈ కొత్త తలనొప్పి ఉద్రిక్త పరిస్థితిని సృష్టించింది.

మరి ఈ పరిస్థితిని తగ్గించేందుకు RRR నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి. మార్చి 25న మలయాళంలో RRR రికార్డు స్థాయిలో స్క్రీన్‌ లలో రిలీజ్ అవుతుంది. మన హీరోలకున్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని, చిత్ర బృందం అక్కడ కూడా ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించారు.

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటించగా.. అజయ్ దేవగన్ - అలియా భట్ - ఒలివియా మోరిస్ - సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు.

అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథాంశంతో RRR రూపొందిందనే సంగతి తెలిసిందే. ఇందులో రామరాజుగా చరణ్.. భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో RRR విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో దుబాయ్ మరియు కర్ణాటకలలో మేకర్స్ రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని చిక్కబల్లాపూర్ లో జరగబోయే కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అతిథిలుగా హాజరు కానున్నారు. మెగాస్టార్ చిరంజీవి - నందమూరి బాలకృష్ణ హాజరయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News