వేణు మాధవ్ వారసులు ఇండస్ట్రీకి వస్తారా?
కోట్లాది మంది ప్రేమాభిమానులు పోందే ఫిల్డ్ ని ఎందుకు వదిలేసుకుంటామని ఇటువైపు రావడానికే ఆసక్తి చూపిస్తుంటారు.
ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కొత్తేం కాదు. స్టార్ హీరోల కొడుకులు..కూతుర్లు ఇదే రంగంలో స్థిరపడటానికి చూస్తుంటారు. చాలా రేర్ గానే ఇతర వ్యాపారాల్లో కొనసాగుతుంటారు. అందులోనూ టాలీవుడ్ నుంచి అయితే? కోట్లాది మంది ప్రేమాభిమానులు పోందే ఫిల్డ్ ని ఎందుకు వదిలేసుకుంటామని ఇటువైపు రావడానికే ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇక్కడ వారతసత్వంతో పాటు ట్యాలెంట్ అవసరం.
రెండు ఉన్నప్పుడే రాణించడానికి అవకాశం ఉంటుంది. అయితే వారసులంతా సక్సెస్ అయిన సందర్భం లేదు. దివంగత నటుడు శ్రీహరి తర్వాత అతని కుమారుడు ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు చేసాడు. కానీ సక్సెస్ అవ్వలేదు. అవకాశాలు రాకపోవడంతో అతడిప్పుడు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు బ్రహ్మానందం కుమారుడు కూడా ఎంట్రీ ఇచ్చాడు. కానీ అతడు సక్సెస్ అవ్వలేదు.
కొన్ని సినిమాలు చేసి వెళ్లిపోయాడు. ఇలాంటి సన్నివేశాలు కూడా ఎదుర వుతుంటాయి. తాజాగా మరో దివంగత నటుడు వేణుమాధవ్ కుమరులు ఇండస్ట్రీకి వస్తారా? అన్న అంశం తెరపైకి వచ్చింది. వేణుమాధవ్ భార్య శ్రీవాణి. ఆ దంపతులకు ఇద్దరు కుమార్లు. పెద్దబ్బాయ్ ప్రభాకర్..చిన్నబ్బాయి సావికర్. ఓ ఇంటర్వ్యూలో తల్లితో పాటు పాల్గొన్నారు. ఇద్దరు పెద్దవాళ్లే . ఇండస్ట్రీకి పనికొచ్చే కటౌట్లే.
అయితే వస్తారా? రారా? అన్నది చూడాలి. ప్రస్తుతం ఇద్దరు చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా శ్రీవాణి భర్త గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. ఆవేంటో ఆమె మాటల్లోనే..` మా పెళ్లి తరువాతనే వేణుమాధవ్ బిజీ అయ్యారు. అవుట్ డోర్ షూటింగు ఉన్నప్పుడు రెండు మూడు వారాల తరువాత రావడం ఆయనకి అలవాటే. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడో షూటింగులో ఉన్నారు, రేపో మాపో వచ్చేస్తారు అనే నాకు అనిపిస్తూ ఉంటుంది. షూటింగుకి బయటికి వెళ్లినప్పుడు, ఏ మాత్రం సమయం దొరికినా తనే కాల్ చేస్తూ ఉండేవారు. పిల్లలను ఆయన ఎంతో బాగా చూసుకునేవారు. ఆర్ధికంగా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆయన తీసుకున్న ముందస్తు జాగ్రత్తనే అందుకు కారణ` అన్నారు.