వీపందంలో ఆ కవ్వింపు ఏంటి కియారా?
నిరంతరం తనలో ఐకానిక్ గాళ్ ని హైలైట్ చేస్తుంటుంది.
నవతరం భామా మణుల్లో కియారా అద్వాణీ ఫ్యాషన్ సెన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఫ్యాషన్ వరల్డ్ లో తానెంతో అడ్వాన్స్ అని ఇప్పటికే ఎన్నోసార్లు ప్రూవ్ చేసిది. ఇండస్ట్రీకొచ్చిన అనతి కాలంలో కేన్స్ వేడుకల్లో సైతం మెరిసి బ్యూటీగా రికార్డు దక్కించుకుంది. మరెన్నో అంతర్జాతీయ వేదికలపైనా కియారా మెరిసింది. నిరంతరం తనలో ఐకానిక్ గాళ్ ని హైలైట్ చేస్తుంటుంది.
తాజాగా అమ్మడు మరోసారి డిజైనర్ దుస్తుల్లో తళుక్కున మెరిసింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ గీతల డిజైన్ లో కియారా అలంకరణ మామూలుగా లేదు. హైహీల్స్ ధరించి అలా విదేశీ వీధుల్లో నడుచుకుంటూ వెళ్తోంది. మరో పిక్ లో బ్లూ కలర్ ఔట్ ఫిట్ లోనూ మెరిసింది. ఈ రెండిటిలోనూ కేవలం వీపు అందాన్నే హైలైట్ చేసింది.
ఫ్రంట్ నుంచి ముఖాన్ని మాత్రం చూపించలేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలు వార్ -2 సెట్స్ నుంచి వచ్చినవిగా చెబుతున్నారు. మరి అందులో నిజమెంతో తెలియాలి. ఇక అమ్మడు త్వరలో `గేమ్ ఛేంజర్` తో సందడి చేయడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.
డిసెంబర్ లో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై కియారా చాలా ఆశలు పెట్టుకుంది. కియారా తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో? సక్సెస్ అయితే గుర్తింపు అదే స్థాయిలో దక్కుతోంది. మరోవైపు బాలీవుడ్ లో `వార్ -2` లో నటిస్తోంది. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జోడీగా నటిస్తోందని సమాచారం.