ప్రభాస్ - పవన్ - చరణ్ - బన్నీ.. అందరూ నాని తర్వాతే..!

Update: 2022-06-19 04:30 GMT
తెలుగు సినిమాలకు ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇక్కడ ప్లాప్ అయిన చిత్రాలు కూడా అక్కడ భారీ వసూళ్లు రాబట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే మేకర్స్ ఓవర్ సీస్ మార్కెట్ ను కీలకంగా భావిస్తుంటారు.

యూఎస్ మార్కెట్‌ ను ఎంజాయ్ హీరోలలో సౌత్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు అగ్ర స్థానంలో ఉంటారని చెప్పొచ్చు. మహేష్ కెరీర్ లో అత్యధికంగా పదకొండు $1 మిలియన్ కు పైగా వసూళ్ళు రాబట్టిన సినిమాలు ఉన్నాయి. ప్లాప్ టాక్ తో కూడా ఈజీగా మిలియన్ మార్క్ అధిగమిస్తున్నారంటే అక్కడ మహేష్ క్రేజ్ ఎలా ఉందో అర్థం అవుతుంది.

మహేష్ బాబు తర్వాత టాలీవుడ్ నుంచి ఓవర్ సీస్ లో ఏడు $1 మిలియన్ మార్క్ సినిమాలతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండో ప్లేస్ లో ఉన్నారు. అయితే ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ - ప్రభాస్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలను అధిగమించి యూఎస్ లో సత్తా చాటిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది నేచురల్ స్టార్ నాని అనే చెప్పాలి.

నాని కెరీర్ లో ఇప్పటి వరకు 6 సినిమాలు మిలియన్-డాలర్ క్లబ్‌ లో చేరగా.. లేటెస్టుగా 'అంటే సుందరానికి' చిత్రం యూఎస్ఏ మార్కెట్‌ లో $1 మిలియన్ కంటే ఎక్కువ వసూళ్ళు సాధించిన 7వ చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో $మిలియన్ మార్క్ హీరోల లిస్టులో ఎన్టీఆర్ సరసన చేరాడు నాని.

ఈగ ($1.07M) - నేను లోకల్ ($1.08M) - MCA ($1.08M) - నిన్ను కోరి ($1.2M) - జెర్సీ ($1.32M) - భలే భలే మగాడివోయ్ ($1.43M) వంటి సినిమాలు మిలియన్ క్లబ్ లో ఉన్నాయి. ఇప్పుడు 'అంటే సుందరానికి' డొమెస్టిక్ మార్కెట్ లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోయినప్పటికీ.. యూఎస్ బాక్సాఫీస్ మంచి వసూళ్లు సాధించి నాని స్టామినా ఏంటో మరోసారి చూపించింది.

పాండమిక్ టైంలో 'వి' 'టక్ జగదీశ్' వంటి రెండు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవడంతో థియేటర్ మార్కెట్ పై ఎఫెక్ట్ పడుతుందనే టాక్ వచ్చింది. దీనికి తగ్గట్టుగానే 'శ్యామ్ సింగరాయ్' సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. $1 మిలియన్ క్లబ్‌లో చేరలేదు. కానీ ఇప్పుడు అంటే.. తో మళ్లీ యూఎస్ మార్కెట్ లో సత్తా చాటారు.

నాని - నజ్రియా ఫహద్ జంటగా టాలెంటెడ్ దర్శకు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం “అంటే సుందరానికీ”. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సాధించలేకపోయింది. అయితే యూఎస్ లో మాత్రం చిత్రం మంచి వసూళ్లనే అందుకుంది.

సహజమైన నటనతో అన్ని రకాల జోనర్లలో సినిమాలు చేస్తున్న నాని.. అమెరికాలో క్రేజ్‌ ను ఆస్వాదిస్తున్నాడు. రానున్న రోజుల్లో మరిన్ని చిత్రాలు $1 మిలియన్ క్లబ్‌ లో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం 'దసరా' చిత్రంలో నటిస్తున్న నాని.. ఈసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేయబోతున్నారు.
Tags:    

Similar News