అల్లు శిరీష్ హీరోగా లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించిన శ్రీరస్తు శుభమస్తు చిత్రం మరో రెండు వారాల్లో విడుదల కానుంది. ఈ సినిమా పాటలను ఒక్కొక్కటిగా నెట్ లో విడుదల చేస్తూ.. సరైనోడుతో తామే ప్రారంభించిన కొత్త ట్రెండ్ ని కంటిన్యూ చేస్తోంది గీతా ఆర్ట్స్. అన్ని పాటలు విడుదల చేశాక చివర్లో ఓ సారి ఆడియో ఫంక్షన్ నిర్వహించి హైప్ తీసుకొచ్చే ప్లాన్ ఇది అంటున్నారు.
శ్రీరస్తు శుభమస్తు చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు 'అను అను అను' అంటూ సాగే మెలోడీని విడుదల చేశారు. ఈ పాటను థమన్ స్వయంగా పాడ్డం విశేషం. మీడియం పేస్ తో ఉండే ఈ మెలోడీ.. అటు లిరిక్ పరంగాను.. ఇటు మ్యూజిక్ పరంగానూ ఆకట్టుకుంటోంది. శ్రీమణి రాసిన పాటకు థమన్ ఇచ్చిన మ్యూజిక్.. గాత్రం ప్రాణం పోశాయి. కుటుంబ కథా చిత్రానికి తొలిసారిగా మ్యూజిక్ ఇస్తున్న థమన్.. తనలోని ఇంకో కోణాన్ని బయటకు తీశాడని చెప్పచ్చు.
సోలో ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న విడుదల కానుండగా.. ఇక్కడ కబాలి హంగామా కాస్త డౌన్ అయ్యాక ఆడియో ఫంక్షన్ చేయాలని నిర్మాత అల్లు అరవింద్ డిసైడ్ అయ్యారని టాక్.
Full View