నుదుటన గంధం బొట్టు.. ఆడ్ గా కనిపించే పెద్ద కళ్లజోడు.. ఆయిలీ హెయిర్.. ఫన్నీగా అనిపించే యాక్సెంట్ తో పదేళ్ల క్రితం హిందీ టీవీషోల్లో తెగ పాపులరయిన క్యారెక్టర్ లోలా కుట్టి. ఆ క్యారెక్టర్ ఎంతగా పాపులర్ అంటే ఆమె అసలు పేరు కూడా చాలామందికి గుర్తుండదు. ఆమె అసలు పేరు అను మీనన్ అయినా లోలా కుట్టిగానే అందరికీ గుర్తుండేది. టాక్ షోలకు పాపులారిటీ తెచ్చిన తొలితరం హోస్ట్ లలో అను మీనన్ పేరు ముందే ఉంటుంది.
ఆరేళ్ల క్రితం టీవీకి విరామమిచ్చిన అను మీనన్ తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాకపోతే ఇంతకుముందు ప్రేక్షకులు చూపిన లోలా కుట్టిగా కాదు. క్వీన్స్ వెర్సస్ కింగ్స్ అనే కామెడీ షో చేయడానికి ఆమె ఓకే చెప్పింది. ఇందులో ముగ్గురు అమ్మాయిలతో ఉండే టీంను అను లీడ్ చేయబోతోంది. టోటల్ ఫన్నీగా ఉండే ఈ షో ప్రేక్షకులను ఎంటర్ టెయిన్ చేస్తుందని నమ్మకంగా చెబుతోంది. త్వరలో ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ కానుంది. అనుకు విపరీతమైన పేరు తెచ్చిపెట్టిన లోలా కుట్టి క్యారెక్టర్ ను తిరిగి ఇంట్రడ్యూస్ చేసే ఆలోచన ఉందా అని అడిగితే కొత్తదనం ఏదీ లేకుండా ఆ క్యారెక్టర్ ను అలాగే తిరిగి చూపిస్తే ప్రేక్షకులకు రొటీన్ అనిపించడం తప్ప ఉపయోగం ఉండదని అను అంటోంది.
ఇన్నేళ్లగా టీవీషోలకు దూరంగా ఉండటానికి కారణంగా కాస్త బ్రేక్ తీసుకోవాలని అనిపించడమే అని చెప్పుకొచ్చింది అను మీనన్. ఇదే టైంలో తాను ప్రెగ్నెంట్ అవడం... తరవాత కొడుకు మంచి చెడులు చూసుకోవడంతో టీవీషోల గురించి ఆలోచన చేయలేదంది. ఇప్పుడు కొడుకుకు ఐదేళ్లు రావడంతో తీరిక చిక్కిందని.. క్వీన్స్ అండ్ కింగ్స్ కాన్సెప్ట్ నచ్చడంతో ఈ షో చేస్తున్నానని చెబుతోంది లోలా కుట్టి.