రామ్ గోపాల్ వర్మ అప్పట్లో ఓ సారి శ్రీదేవి అనే సినిమా స్టార్ట్ చేశాడు కదా. ఇప్పుడా శ్రీదేవి సంగతి ఏమయిందో తెలీదు కానీ.. ఆ సినిమా హీరోయిన్ అనుకృతి మాత్రం వివాదంలో చిక్కుకుంది. ఓ మూవీ మొదలు పెట్టి.. కొంత భాగం షూట్ చేశాక ఇప్పుడు నానా హంగామా చేస్తోందని.. షూటింగ్ కి సహకరించడం లేదని అంటున్నారు.
పాప.. ఈ టైటిల్ పై రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు అనకృతి ఒప్పుకుంది. యోగి దర్శకత్వంలో కొంత భాగం షూట్ చేసేశారు కూడా. ఇప్పుడు సడెన్ గా సెట్స్ నుంచి బయటకు వెళ్లిపోయి.. ఇక షూటింగ్ చేయబోనని అంటోందిట. ఇందుకు కారణంగా కొన్ని సీన్స్.. మరికొన్ని డైలాగ్స్ అంటోంది అనుకృతి. వాటిలో బూతు కంటెంట్ మరీ ఎక్కువగా ఉందని.. ఇలాంటి సీన్స్ చేయబోనని తెగేసి చెబుతోందిట ఈమె. అంతే కాదు.. సినిమా చేయనపుడు రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేయమంటే.. తాను చేసిన సీన్స్ కి సంబంధించిన ఫుటేజ్ వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది.
డైలాగ్ వెర్షన్ తో సహా స్క్రిప్ట్ మొత్తం సినిమాకి ముందే అనుకృతికి ఇచ్చేశామంటున్నాడు దర్శకుడు యోగి. ఇప్పుడు తన పరిస్థితులు మారాయని అందుకే చేయనని ఈ హీరోయిన్ అంటోందని టాక్. దీంతో తమకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లుతోందని.. ఫిలిం ఛాంబర్ లోను.. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.