హిందీ సినిమా సహా అన్ని భాషల సినిమాలు కలుపుకుని 500 పైగా చిత్రాల్లో నటించారు అనుపమ్ ఖేర్. సీనియర్ నటుడిగా లెజెండరీ నటగురువుగా ఆయనకు అసాధారణ ఫాలోయింగ్ ఉంది. పద్మశ్రీ.. పద్మభూషణ్ వంటి గొప్ప అవార్డుల్ని ఆయన అందుకున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కర్తగానూ అనుపమ్ జీకి ప్రపంచవ్యాప్తంగా బోలెడంత మంది శిష్యగణం ఉన్నారు. ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కి ఆయన మాజీ ఛైర్మన్. తన మొత్తం జీవితాన్ని సినిమా టీవీకే అంకితమిచ్చారు. అందుకే ఆయనంటే గొప్ప గౌరవం. హైదరాబాద్ లోనూ ఆయన నటశిక్షణా సంస్థను రన్ చేస్తున్నారు.
అంత గొప్ప వ్యక్తి నుంచి ఒక ప్రశంస అందుకోవాలంటే దానికి ఎంతో గొప్ప అర్హత ఉండాలి. ఆ అర్హత తనకు ఉందని నిరూపించారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అతడు నటించిన పుష్ప - ది రైజ్ సినిమా చూసిన అనుపమ్ జీ ఎంతో మంత్రముగ్ధుడయ్యారు. ఆ సంగతి అతడి నోటి నుంచి వెలువడిన పదజాలం రూపంలో కనిపించింది. అనుపమ్ తన ట్విట్టర్ లో ప్రస్థావిస్తూ... అవకాశం ఇస్తే అల్లు అర్జున్ తో కలిసి పని చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. ``పుష్ప చూశాను. బ్లాక్‌బస్టర్ కి నిజమైన సెన్స్... జీవితం కంటే పెద్దది.. అధిక అడ్రినల్ .. పూర్తి పైసా వసూల్. ప్రియమైన @అల్లు అర్జున్ మీరు #రాక్‌స్టార్!! మీ ప్రతి యాటిట్యూడ్.. సూక్ష్మ విలక్షణత నాకు నచ్చింది. త్వరలో మీతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను. మొత్తం టీమ్ కి అభినందనలు! జై హో!`` అని అనుపమ్ ట్వీట్ చేశారు.
అంత గొప్ప నటుడి నుంచి కాంప్లిమెంట్స్ రావడంతో బన్నీ కూడా అంతే వినమ్రంగా స్పందించారు. ``అనుపమ్ జీ... మీ నుండి హృదయపూర్వక అభినందనను స్వీకరించడం ఆనందంగా ఉంది. వినయపూర్వకంగా.. మీరు అభినందించినందుకు చాలా ఆనందంగా ఉంది. మీతో కూడా పని చేయాలని ఆశిస్తున్నాను. అందరి ప్రేమకు ధన్యవాదాలు`` అని బదులిచ్చారు. ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు పని చేయాలని అనుకోవడం అభిమానులకు సంతోషమే. ఇక పుష్ప 2కి అనుపమ్ లాంటి గ్రేట్ స్టార్ యాడైతే అది పెద్ద ప్లస్ అవుతుంది. సుకుమార్ తనకోసం ఒక పాత్రను క్రియేట్ చేస్తారేమో చూడాలి. అన్నట్టు పుష్ప చిత్రంలో బన్ని నటనకు జాతీయ అవార్డు వస్తుందా? జాతీయ అవార్డుల కమిటీలో అనుపమ్ జీ ఉంటారు కదా.. ఆయన దృష్టి ప్రాంతీయ భాషా చిత్రంపై ప్రసరిస్తుందా? అన్నది చూడాలి. అలాగే ఫ్రాంఛైజీ కేటగిరీ సినిమాకి ఉత్తమ నటుడు అవార్డు కట్టబెడతారా? అన్నది కూడా చూడాలి.