వెండితెరపై ఎన్ని కథలు - జోనర్ లు వచ్చినప్పటికీ బయోపిక్‌లకు ఉండే క్రేజే వేరు. కొంత కాలంగా భారతీయ సినిమా పరిశ్రమలో బయోపిక్ ల హవా కొనసాగుతుంది. ఇక బాలీవుడ్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేక్షలను అలరించేందుకు ఇప్పుడు మరో పిక్ రెడీ అయింది. సుప్రసిద్ధ ఆర్థిక వేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ బయోపిక్ రూపుదిద్దుకుంటోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సలహాదారుడు, తెలుగు బిడ్డ అయిన సంజయ్ బారు రాసిన `ది యాక్సిడెంటల్ ఫ్రైమ్ మినిస్టర్` పుస్తం ఆధారంగా ఈ సినిమా వస్తోంది.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా `ది యాక్సిడెంటల్ ఫ్రైమ్ మినిస్టర్` పేరుతో ఈ బయోపిక్ తెరకెక్కుతుంది. విజయ్ రత్నాకర్ గట్టీ డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీలో సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ టైటిల్ రోల్ అయిన మాజీ ప్రధాని పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను అభిమానులతో అనుపమ్ ఖేర్ పంచుకున్నారు. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించడం నిజంగా సవాల్ లాంటిందని - 24/7 మీడియా పనిచేస్తున్న కాలంలో ఆయన ప్రధానిగా ఉన్నారని - యావత్ ప్రపంచానికి ఆయన తెలుసని - గత కొద్ది నెలలుగా మన్మోహన్ పాత్రను ఆకళింపు చేసుకొంటూ వాస్తవికతకు దగ్గరగా ఉండేలా ప్రయత్నిస్తున్నానని అనుపమ్ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో మన్మోహన్ సలహాదారుడు సంజయ్ బారుగా అక్షయ్ ఖన్నా - సోనియా గాంధీగా సజ్జన్ బెర్నర్ట్ లు నటిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ టీం ఫ్లాన్ చేస్తుంది. కాగా ఇందులో రాజకీయ - ఆర్థిక అంశాలకు పెద్ద పీట ఉంటుందని సమాచారం.