భారతదేశంలో ప్రకృతి అందాలకు కొదవేం లేదు. కొండ కోనలు, పల్లె పట్టు పరిసరాల్లో ఎంతో సహజమైన అందం దాగి ఉంది. ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ లో ప్రకృతి కూడా ఒక భాగం. అరకు, గోవా, ఊటీ, కాశీ, కేదార్ నాథ్ ఇలా ఏ చోట వెతికినా ప్రకృతి అందాల నెలవు. అందుకే ప్రతియేటా సెలబ్రిటీలతో పాటు, సామాన్యులు రకరకాల ప్లేస్ లను విజిట్ చేస్తుంటారు.
ఇదిగో ఇక్కడ అనుపమ పరమేశ్వరన్ ఓ అరుదైన లొకేషన్ కి వెళ్లింది. అక్కడ ఎంతో డేర్ గా అద్భుతమైన ఫోటోల్ని దిగింది. ఆ ఫోటోలు ప్రస్తుతం యువతరం సామాజిక మాధ్యమాల్ల జోరుగా వైరల్ అయిపోతున్నాయి. చుట్టూ కొండలు.. ఎత్తయిన ప్రదేశం.. కొండ పై నుంచి జాలువారుతున్న సెలయేరు వంటి జలపాతం అద్భుతంగా ఉన్నాయి. అలాంటి చోట అనుపమ విన్యాసాలు ఇంకా ఇంకా బావున్నాయి. మైమరిచి చూసేయాలా? అన్నంత అందంగా కనిపిస్తోంది క్యూట్ అనుపమ.
అనుపమ పరమేశ్వరన్ ఇటీవల వరస పరాజయాలతో రేసులో వెనకబడినా తనకంటూ అవకాశాల కేం కొదవ లేదు. ఇటీవలే బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అవకాశం అందుకుంది. తమిళ హిట్ చిత్రం రత్సాసన్ రీమేక్ లో అనుపమ కథానాయికగా ఎంపికైంది. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. కె.ఎల్.యూనివర్శిటీ అధినేత హవీష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నట్టు అనుపమ జాలీ ట్రిప్ ఇంతకీ ఎక్కడ? అరకు లో ఈ తరహా స్పాట్ ఒకటి ఉంది. అలాగే తిరుమలలో మళ్లీ అంతే అందమైన జలపాతాలు కనిపిస్తుంటాయి. అనుపమ సొంత ప్లేస్ కేరళలోనూ ఇలాంటి అందమైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మరి ఈ ఫోటో ఏ స్పాట్ నుంచో తెలియాలి.