కంగారు ప‌డ‌కండి... ఐ యామ్ ఫైన్‌

Update: 2018-07-12 06:49 GMT
త‌న సంపూర్ణ‌మైన‌ న‌వ్వుతో - క‌లువ‌ల‌తో పోటీ ప‌డే క‌ళ్ల‌తో సౌత్ ఇండియాను ఫ్లాట్ చేసిన అనుప‌మ‌కు అనారోగ్యం నిజ‌మా? ఆమెకు ఏదో అయ్యింద‌ట‌? ఈ గాసిప్స్ అన్నింటికీ స్వ‌యంగా చెక్ పెట్టింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. మీడియా వేసే ఏ ప్ర‌శ్న‌కైనా ఏ మాత్రం కోపం తెచ్చుకోని త‌డ‌బ‌డ‌ని ఈ కేర‌ళ అమ్మాయి త‌న హెల్త్‌పై వ‌చ్చిన గాసిప్స్ చూసి న‌వ్వుకుంద‌ట‌.

చిన్న జ్వ‌రానికే ఎంత హ‌డావుడి చేసేశారు అంటూ కామెంట్ చేసింద‌ట‌. తాజాగా ఆమె త‌న‌కు ఏం కాలేద‌ని క్లారిటీ ఇచ్చింది. మ‌రి ఆ వార్త‌లు ఎందుకు వ‌చ్చాయ‌మంటే... ఆమె రామ్ తో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే క‌దా. ఆ *హలో గురు ప్రేమ కోసమే* షూటింగ్ లో స్వ‌ల్ప‌ అస్వస్థతకు గురైన మాట నిజ‌మే. వాటి గురించి ఆమె స్పందిస్తూ.. *నా హెల్త్ పై వస్తున్న రూమర్లు చూసి నేను నవ్వుకున్నాను - నేను వాస్తవానికి మొన్న షూటింగ్ లో ఉన్న‌పుడు - ప్రకాష్ రాజ్ గారితో కలిసి ఒక సీన్ చేస్తున్నాను. ఆ సీన్ లో డైలాగులు చెప్పేట‌పుడు త‌డ‌బ‌డ్డాను. అనుకున్నంత బాగా రాలేదు. డైలాగ్ టైమింగ్ త‌ప్పింది. వెంటనే ప్రకాష్ రాజ్ గారు డైలాగులు మరొకసారి చెప్పమని - ఇంకో టేక్ చేద్దాం అన్నారు. అయితే, అప్పటికే ఉదయం నుంచి నాకు ఆరోజు జ్వ‌రంగా ఉంది. లో బీపీ కూడా ఉంది. దీంతో షూటింగ్ లో కొంత న‌ల‌త‌కు గుర‌య్యాను. కంగారు ప‌డి యూనిట్ సభ్యులు న‌న్ను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్లు కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. అవి వేసుకున్నాను. త‌గ్గిపోయింది. అంతే* అంటూ వివ‌రించారు.

మీడియాలో నా జ్వరానికే ఇన్ని వార్త‌లు వ‌స్తాయ‌ని అనుకోలేదు. చాలా హ‌డావుడి అనిపించింది. సాధార‌ణంగా షూటింగ్‌లో అన్ని విష‌యాలు అంద‌రికీ తెలియ‌వు కాబ‌ట్టి న‌న్ను ఎందుకు ఆస్ప‌త్రికి తీసుకెళ్తున్నారో తెలియ‌ని కొంద‌రు ఏదో జ‌రిగిపోయింద‌ని చెప్పుకున్న క‌బుర్లు ఇలా వార్త‌లైపోయాయి అంద‌ట ఆమె. ఫ్యాన్స్ బీ కూల్ షీ ఈజ్ సేఫ్‌.
Tags:    

Similar News