మరింత పట్టుదలతో అనుష్క ప్రయత్నం.. తగ్గితేనే సినిమా మొదలు

Update: 2021-03-10 09:30 GMT
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న అనుష్క బాహుబలి తర్వాత ఉత్తర భారతం దక్షిణ భారతం అనే తేడా లేకుండా ప్రభాస్ మాదిరిగా పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ గా మారి పోవడం ఖాయం అంటూ అంతా భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ఆమె సైజ్‌ జీరో సినిమా కోసం వెయిట్‌ పెంచి కష్టాలు కొని తెచ్చుకుంది. బాహుబలి రెండవ పార్ట్‌ నుండి మొదలు పెట్టుకుని మొన్నటి నిశబ్దం సినిమా వరకు అనుష్క ఏ సినిమా చేసినా కూడా అందులో ఆమె వెయిట్‌ ను తగ్గించేందుకు విజువల్‌ ఎఫెక్ట్స్ ను వినియోగించాల్సి వస్తుందట. అంటే ఆమె ను నాజూకుగా చూపించేందుకు గ్రాఫిక్స్‌ వాడుతున్నారు. అయినా కూడా సినిమా లు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోతున్నాయి.

నిశబ్దం సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందనుకుంటే నిరాశ పర్చింది. దాంతో అనుష్క మళ్లీ ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది. వెయిట్‌ తగ్గడం కోసం అనుష్క గతంలోనే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని ఆమె పెద్దగా వెయిట్‌ తగ్గిన దాఖలాలు మాత్రం కనిపించలేదు. ఈసారి మళ్లీ వెయిట్‌ లాస్ కోసం అనుష్క సహజమైన పద్దతులను కాస్త కఠినంగా ఫాలో అవుతున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. గత రెండు మూడు నెలలుగా అనుష్క వర్కౌట్‌ లు చేయడంతో పాటు కఠినమైన డైట్ ను ఫాలో అవుతుందట. మరో నెల రెండు నెలల పాటు ఇదే కంటిన్యూ చేసి ఆ తర్వాత నాజూకుగా అయితే అప్పుడు సినిమా మొదలు పెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వెయిట్‌ లాస్‌ కోసం పడుతున్న కష్టం సక్సెస్‌ అయిన తర్వాత మాత్రమే సినిమాను మొదలు పెట్టాలని అనుష్క భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈమె రెండు సినిమాలకు కమిట్‌ అయ్యిందనే వార్తలు వచ్చాయి. మరి వాటిలో ఏది మొదట షురూ అయ్యేను.. ఎప్పుడు అయ్యేను అనేది చూడాలి.
Tags:    

Similar News