ఫోటో స్టోరి: సింగర్ ఏ సూపించేత్తందో

Update: 2018-03-26 10:52 GMT

సినిమా హీరోయిన్లు సోషల్ మీడియాలో గ్లామర్ రచ్చ చేయడం చూస్తూనే ఉంటాం. అప్ కమింగ్ హీరోయిన్లు.. అవకాశాల కోసం పాకులాడేవాళ్లు కూడా సామాజిక వేదికలను అందాల ప్రదర్శనల కోసం అడ్డదిడ్డంగా వాడేసుకుంటూ ఉంటారు. ఇప్పుడిప్పుడే ఇతర క్రాఫ్టులకు చెందిన వారు కూడా జత అవుతున్నారు కానీ.. మరీ శృతి మించడం మాత్రం కనిపించడం లేదు.

కానీ ఓ సింగర్ మాత్రం అందరినీ మించిపోయేలా.. ఆమాటకు వస్తే ఇప్పటివరకూ అందాల విందు చేసిన అందరినీ తలదన్నేలా ఓ బికినీ పిక్ ను పోస్ట్ చేసింది. ఆ భామ ఎవరో కాదు.. అనుష్క మంచండ. సూపర్ హిట్ సాంగ్స్ తో పాటు.. ఐటెం సాంగ్స్ పాడడంలో స్పెషలిస్ట్ అయిన ఈ భామ.. టూ పీస్ మైక్రో బికినీ వేసుకుని ఈ భామ ఇచ్చిన పోజు చూస్తే.. ఎవరికైనా గుండె ఓ సారి ఆగి కొట్టుకోవాల్సిందే. అది తన ఫోటోనే అని అనుష్క చెప్పింది కాబట్టి సరిపోయింది కానీ.. సడెన్ గా చూసి ఓ హాలీవుడ్ సుందరాంగి చిత్రమో అనుకునే అవకాశాలు కూడా లేకపోలేదు.

అంతగా తన వెనుక అందాలను ఎక్స్ పోజ్ చేసి పారేసింది అనుష్క మంచండ. 'నా ఉద్దేశ్యం ఏంటో మీకు అర్ధమయితే.. నా పోస్టులను బ్యాలెన్స్ చేసేందుకే ఈ ఫోటో' అంటూ ఓ కామెంట్ కూడా పెట్టింది అనుష్క. ఇంతలేసి అందాలు ఎదురుగా కనిపిస్తుంటే.. అవీ ఇవీ అర్ధాలు వెతుక్కోవడం ఎందుకు అనుకుంటూ తెగ సంతోషించేస్తున్నారు గ్లామర్ లవర్స్.
Tags:    

Similar News