అనుష్క సినిమా సౌండింగ్ లేదేంటి..?

Update: 2021-07-14 23:30 GMT
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి - యువ హీరో నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. దక్షిణాది అగ్ర కథానాయికగా వెలుగొందిన స్వీటీ.. స్టార్ హీరోతో కాకుండా కుర్ర హీరోతో జత కట్టడం ఏంటని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'రా రా కృష్ణయ్య' ఫేమ్ మహేష్ దర్శకత్వంలో యూవీ క్రియేష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమయ్యారు.

వయసులో తన కంటే పెద్దదైన ఓ మహిళ ప్రేమలో పడే కుర్రాడి కథాంశంతో రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని టాక్ వచ్చింది. అంతేకాదు ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా ''మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి" అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో రానుందని చెప్పుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండానే ఆగిపోయిందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ లోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చి బ్రేక్ వేసింది. ఇప్పుడు షూటింగులన్నీ యధావిధిగా జరుగుతుండటంతో జూన్ చివరి వారం నుంచి అనుష్క శెట్టి - నవీన్ పోలిశెట్టి సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందని న్యూస్ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రాజెక్ట్ విషయంలో మేకర్స్ పునరాలోచనలో పడ్డారట.

అందుకే ఇప్పటివరకు సినిమాని అధికారికంగా ప్రకటించలేదని.. షూటింగ్ స్టార్ట్ చేయలేదని టాక్. దీనికి కారణాలు ఎంతో తెలియనప్పటికీ ప్రస్తుతానికైతే ఈ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టారని అంటున్నారు. ఇందులో నిజమెంతో ఇంకొన్ని రోజుల్లో తెలియనుంది. కాగా, 'అరుంధతి' 'బాహుబలి' 'రుద్రమదేవి' 'భాగమతి' వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్న అనుష్క.. చివరిగా ‘నిశ్శబ్దం’ సినిమాలో కనిపించింది. ఓటీటీలో విడుదలైన ఈ రిజల్ట్ తో నిశబ్దంగా ఉంటూ వస్తున్న అనుష్క శెట్టి.. మరో చిత్రాన్ని అనౌన్స్ చేయలేదు.

మరోవైపు 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హీరోగా మారి హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి.. ఈ ఏడాది ప్రారంభంలో 'జాతిర‌త్నాలు' వంటి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని.. అవి కూడా పెద్ద నిర్మాణ సంస్థల్లో అని.. త్వరలోనే వెల్లడిస్తానని నవీన్ తెలిపారు.
Tags:    

Similar News