తూచ్‌.. భాగ్మతి రొటీన్‌ సినిమాయే

Update: 2016-05-10 06:24 GMT
భాగ్మతి.. 17వ శతాబ్దం రాజు కులీ కుతుబ్‌ షా భార్య.. ఆమె పేరు మీదనే బాగ్యనగరం నిర్మించారు. అయితే ఈ ప్రేమకథను ఒక రాజుల కాలం నాటి దృశ్యకావ్యంగా మలుద్దామని చాలామంది దర్శకులు అనుకున్నారు. అనూహ్యంగా అనుష్క మెయిన్‌ లీడ్‌ లో పిల్ల జమిందార్‌ ఫేం అశోక్‌ డైరక్షన్ లో భాగ్మతి సినిమా రూపొందుతోంది అనగానే.. ఇంతటి సాహసం అశోక్‌ చేస్తున్నాడా అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు.

కాని ఇక్కడ మ్యాటర్‌ వేరండోయ్‌. అసలు అనుష్కతో చేసేది హిస్టారికల్‌ మూవీయే కాదంట. ''అవును. నేను చేస్తోంది కేవలం ఒక థ్రిల్లర్‌ సినిమా. 17వ శతాబ్దానికి చెందిన చరిత్ర అని చాలామంది అనుకుంటున్నారు. కాని ఇక్కడ అనుకున్న కథ వేరు. భాగ్మతి అనే అమ్మాయి చుట్టూ తిరిగే ఒక థ్రిల్లర్‌ సినిమా ఇది'' అంటూ చెప్పుకొచ్చింది అనుష్క. అంటే ఒక గీతాంజలి.. ఒక కహానీ.. టైపులో సాగే సినిమా అనమాట. సో.. మరోసారి అశోక్‌ ఒక రొటీన్‌ సినిమానే తీస్తున్నాడే కాని.. ఏదో బాహుబలి రేంజ్‌ కొత్త సినిమా కాదని చెప్పొచ్చు.

ఇకపోతే బాహుబలి 2 షూటింగ్‌ గురించి ఏమీ చెప్పని అనుష్క.. ప్రస్తుతం తన వర్కంతా అయిపోయిందని.. అందుకే తాను ఇలా కొత్త కొత్త సినిమాలకు కమిట్‌ అవుతున్నానని తెలిపింది.
Tags:    

Similar News